అనారోగ్యంతో సీనియర్ నిర్మాత కన్నుమూత!

తెలుగు సినీ చరిత్రలో అనేక గొప్ప చిత్రాలను నిర్మించిన నిర్మాత దొరస్వామిరాజు అనారోగ్యంతో హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో  చికిత్స పొందుతూ ఈ ఉదయం  తుదిశ్వాస విడిచారు. తెలుగులో నిర్మాతగా 500పైగా చిత్రాలను.. డిస్ట్రిబ్యూటర్గా సీడెడ్ ఏరియాల్లో అనేక చిత్రాలను విడుదల చేశారు. కిరాయి దాదా, సీతారామయ్యగారి మనవరాలు, ప్రెసిడెంట్‌గారి పెళ్లాం, అన్నమయ్య, సింహాద్రి, భలే పెళ్ళాం, వెంగమాంబ వంటి చిత్రాలు ఆయన నిర్మాణ సారధ్యంలో రూపుదిద్దుకున్నవే. నిర్మాత, డిస్ట్రిబ్యూటర్గా తెలుగు ఇండస్ట్రీలో ఆయానకంటూ ఓ ఇమేజ్ ఏర్పర్చుకున్నారు దొరస్వామి.

1978లో వి.ఎమ్.సి.( విజయమల్లేశ్వరి కంబైన్స్) పేరు మీద డిస్ట్రిబ్యూషన్ సంస్థను ప్రారంభించి తొలుత యన్టీఆర్, కె.రాఘవేంద్రరావు కాంబినేషన్ లో వచ్చిన ‘సింహబలుడు’ చిత్రాన్ని విడుదల చేశారు. ఆ తరువాత “వేటగాడు, యుగంధర్, గజదొంగ, ప్రేమాభిషేకం, కొండవీటి సింహం, జస్టిస్ చౌదరి” వంటి విజయవంతమైన చిత్రాలను తమ సంస్థ ద్వారా విడుదల చేశారు. అప్పటి నుంచీ దొరస్వామి రాజును అందరూ వీఎమ్‌సీ దొరస్వామి రాజు అని పిలిచేవారు.
వి.ఎమ్.సి. తో పాటు విజయలక్ష్మీ పిక్చర్స్ వి.ఎల్.పి. సంస్థను కూడా దొరస్వామి రాజు స్థాపించి పలు చిత్రాలను విడుదల చేశారు. ఫిలిమ్ ఛాంబర్ అధ్యక్షునిగా రెండు సార్లు పనిచేశారు. 1994లో చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచారు.
కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నా ఆయన బంజారాహిల్స్ లోని కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించడం తెలుగు చిత్ర సీమకి ఎనలేని లోటు. ఈ విషయం తెయడంతో సినీ ప్రముఖులు సంతాపం తెలియజేశారు.