సోమ్‌నాథ్‌ ఆలయ ట్రస్ట్ నూతన చైర్మన్ ప్రధాని మోదీ

ప్రఖ్యాత సోమనాథ్ ఆలయ ట్రస్ట్ నూతన చైర్మైన్గా ప్రధాని నరేంద్ర మోదీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గత కొన్నేళ్లుగా ట్రస్ట్ ఛైర్మన్గా ఉన్నటువంటి గుజరాత్ మాజీ సీఎం కేశుభాయ్ పటేల్ అక్టోబర్లో మరణించిడంతో అప్పటినుంచి ఈ స్థానం ఖాళీగా ఉంది. సోమవారం సమావేశమైన ఆలయ ట్రస్టు వర్చువల్ పద్ధతిలో ట్రస్టు ఛైర్మన్ ని ఎన్నుకోవడం జరిగింది. ఈ ట్రస్టులో సభ్యులుగా భాజపా సీనియర్ నేత ఎల్ కె అడ్వాణీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా
ప్రఖ్యాత సోమ్‌నాథ్‌ ఆలయ ట్రస్ట్‌ కొత్త ఛైర్మన్‌గా తదితరులున్నారు.
ఎన్నో అద్భుతమైన చారిత్రక నేపథ్యం ఉన్న సోమనాథ్ ఆలయం 12 ద్వాదశ జ్యోతిర్లింగాలలోని మొట్ట మొదటి జ్యోతిర్లింగ క్షేత్రం. ఈ ఆలయం గుజరాత్ రాష్టంలోని గిరి సోమనాథ్ జిల్లాలోని వెర్వాల్ ప్రాంతంలో ఉంది. ఇక్కడ ఉన్నటువంటి పురాతన శివాలయం శివభక్తులచే గౌరవించబడుతూ పూజింపబడుతుంది.