అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ పశ్చిమబెంగాల్లో అధికార తృణమూల్, ప్రతిపక్ష బీజేపీ నాయకుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తనపై పోటీ చేసి గెలిస్తే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కి సవాల్ విసిరారు బీజేపీ నేత సువేందు అధికారి. సోమవారం ఓ బహిరంగ సభలో దీదీ నందిగ్రామ్ నుంచి పోటీచేస్తున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో అధికారి ఈ వ్యాఖ్యలు చేశారు.
ఆమె (మమతా బెనర్జీ)ఎన్నికల సమయంలో మాత్రమే నందిగామ్ కి వెళుతుంది. అక్కడి ప్రజల కోసం ఆమె ఏమిచేశారో చెప్పగలరాని ప్రశ్నించారు. దీదీ పై ఎవరు పోటీ చేసిన 50000 ఓట్ల తేడాతో గెలుస్తారని.. ఆమె చేతిలో ఓడిపోతే రాజకీయాల నుంచి శాస్వతంగా తప్పుకుంటానని అన్నారు.
గత ఎన్నికల్లో తృణమూల్ పార్టీ తరపున నందిగామ్ నియోజకవర్గ నుంచి గెలిచిన అధికారి కొద్ది రోజుల ముందు పార్టీకి మంత్రిపదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరారు.