తెలుగు రాష్ట్రాల్లో ఇద్దరు సీనియర్ లేడి జర్నలిస్టుల వివాదం చర్చనీయాంశంగా మారింది. రెండు ప్రముఖ తెలుగు చానళ్లలో హైక్యాడర్ పొజిషన్ లో పనిచేస్తున్న ఇద్దరు జర్నలిస్టులు.. తగువులాడుతున్న వీడియో నెట్టింట్ట హల్‌చల్ చేస్తోంది. ఈవీడియోపై నెటిజన్స్ భిన్నంగా కామెంట్స్ చేస్తున్నారు.
కాగా గతంలో ఏపీ ఎమ్మెల్సీ సీటు కోసం ఇద్దరు మహిళ రిపొర్టర్లు తీవ్రంగా ప్రయత్నించారు. ఎవరికి వారు తమకున్న పరిచయాలతో లాభియింగ్ చేశారు. దీంతో హైకమాండ్ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడమే తరువాయి అన్నట్లుగా ప్రచారం జరిగింది. కానీ తీరా అభ్యర్థుల లిస్ట్ ప్రకటించాక వీరికి నిరాశే ఎదరయ్యింది.
ఇదిలా ఉంటే.. తాజాగా ఇద్దరు మహిళ రిపొర్టర్లు తగువులాడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్స్ దొరికిందే అదనుగా కామెంట్లతో ఆడుకుంటున్నారు. బాధ్యత గల వృత్తిలో ఉండి.. సిల్లి వేశాలు ఏంటని ప్రశ్నిస్తున్నారు. సీఎంఓలో జరిగిన విషయాన్ని కూర్చుని మాట్లాడుకుంటే సరిపోయేదానికి..చిన్న పిల్లలా తగువులాడుకోవడం ఏంటన్ని ఎద్దేవ చేస్తూ కామెంట్స్ జోడిస్తున్నారు.
(ఏపీలో ఎమ్మెల్సీ సీటు కోసం జర్నలిస్టుల కుస్తీ..? | Newsminute24 https://newsminute24.com/journalists-fight-for-mlc-seat-in-ap/)