ఉమ్మడి ప్రకాశం జిల్లాలో యువగళం కు పోటెత్తిన జనం..

Yuvagalam: రాష్ట్రంలో కోట్లాదిప్రజల గొంతుకగా మారి రోజురోజుకూ రెట్టించిన ఉత్సాహంతో ముందుకుసాగుతున్న యువగళం పాదయాత్ర మరో మైలురాయిని అధిగమించింది. జోరువర్షాన్ని సైతం లెక్కచేయకుండా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో యువగళం జైత్రయాత్ర దిగ్విజయంగా పూర్తయింది.  జూలై 15వతేదీన రాళ్లపాడు సరిహద్దుల్లో కందుకూరు అసెంబ్లీ నియోజకవర్గంలో అడుగుపెట్టిన యువనేత లోకేష్ పాదయాత్ర 17రోజులపాటు నిర్విరామంగా సాగింది. ఉమ్మడి జిల్లాలో 8 అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్ చేస్తూ 220 కి.మీ.ల మేర కొనసాగిన యువగళానికి ప్రకాశం జిల్లా ప్రజలనుంచి కనీవినీ ఎరుగని రీతిలో మద్దతు లభించింది. 50నెలల అరాచకపాలనలో బాధితులుగా మారిన ప్రజలకు నేనున్నానని భరోసా ఇస్తూ సాగుతున్న యువగళానికి అన్నివర్గాల ప్రజలు నీరాజనాలు పట్టారు. కందుకూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రారంభమైన యువనేత పాదయాత్ర… కొండపి, కనిగిరి, మార్కాపురం, సంతనూతలపాడు, ఒంగోలు, అద్దంకి, దర్శి నియోజకవర్గాల్లో కొనసాగింది. వాతావరణ పరిస్థితుల దృష్ట్యా రాత్రి పొద్దుపోయేవరకు యాత్ర కొనసాగినా వేలాదిప్రజలు యువనేత కోసం రోడ్లవెంట ఎదురుచూడటం పార్టీశ్రేణులను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

1983లో అన్న ఎన్టీఆర్ కోసం ఈవిధంగా జనం వేచిచూసేవారని, 40ఏళ్ల తర్వాత మళ్లీ అదేవిధమైన స్పందన ప్రజల్లో కన్పిస్తోందని సీనియర్లు చెబుతున్నారు. అధికారపార్టీ వైఫల్యాలు, అవినీతిని మాటల తూటాలతో యువనేత లోకేష్ ప్రజాక్షేత్రంలో ఎండగడుతున్న తీరు  వైసిపి నేతలకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 17రోజుల పాదయాత్రలో ప్రతిరోజూ వేలాదిప్రజలు యువనేతను నేరుగా కలుసుకొని తమ సమస్యలు చెప్పుకోగా, 327మంది రాతపూర్వకంగా వినతిపత్రాలు సమర్పించారు. గ్రానైట్ పరిశ్రమదారులు, వర్కింగ్ ప్రొఫెషనల్స్, పొగాకు రైతులు, వివిధ సామాజికవర్గాలతో ముఖాముఖి సమావేశాల ద్వారా వారు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నారు. ఒంగోలు, కనిగిరి, పొదిలి, చీమకుర్తి, అద్దంకి వంటి పట్టణాలతోపాటు మూరుమూల గ్రామాల్లో సైతం వివిధవర్గాల ప్రజలు కుటుంబసభ్యుడి మాదిరిగా యువనేతను ఆదరించారు. చిరునవ్వుతో అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ, ఫోటోలు దిగుతూ యువనేత ముందుకుసాగుతున్న తీరు యువత, మహిళలు, వృద్ధులను ఆకట్టుకుంటోంది. దారిపొడవునా మహిళల గుమ్మడికాయలతో దిష్టితీస్తూ హారతులతో గ్రామాల్లోకి స్వాగతించడం యువనేతపై ప్రజల్లో నెలకొన్న అభిమానానికి అద్దం పడుతోంది. నాలుగేళ్లుగా తప్పుడు కేసులు, పోలీసుల వేధింపులతో నరకం అనువిస్తున్న పార్టీ కేడర్ కు యువనేత పాదయాత్ర మనోధైర్యాన్ని చేకూర్చింది.

భరోసా కల్పించిన జయహో బిసి..           ఒంగోలు రవిప్రియ ఫంక్షన్ ఎదుట 27-7-2023న నిర్వహించిన జయహో బిసి సదస్సుకు రాష్ట్రం నలుమూలల నుంచి పెద్దఎత్తున బిసిలు తరలివచ్చారు. ఈ సదస్సులో వైసిపి పాలనలో బాధితులైన పలువురు బిసి మహిళలు వ్యక్తంచేసిన ఆవేదన అందరినీ కంటతడి పెట్టించింది. సైకో పాలనలో సమాజం మొత్తం భయాందోళనలతో బతుకోంది. టిడిపి అధికారంలోకి వచ్చిన వందరోజుల్లో బిసిల రక్షణ చట్టాన్ని అమల్లోకి తెస్తాం. అధికార మదంతో బిసిలను వేధించిన కామాంధులను రోడ్లపై వెంటాడి కటకటాల్లో పెడతాం. విదేశీవిద్య పథకంతో బిసిబిడ్డలకు ఉన్నత విద్యాభ్యాసానికి అవకాశం కల్పిస్తాం. పెద్దఎత్తున పరిశ్రమలు తెచ్చి ఉద్యోగావకాశాలు కల్పిస్తాం. కులధృవీకరణ పత్రాల కోసం తరచూ ఆఫీసుల చుట్టూ తిరిగే అవసరం లేకుండా సెల్ ఫోన్ ద్వారా ఒక్క బటన్ తో బిసిలకు శాశ్వత కులధృవీకరణ పత్రాలు అందేలా చర్యలు తీసుకుంటాం. పేదరికం లేని రాష్ట్రం కోసం కులవృత్తులను ప్రోత్సహించి, వారి ఆర్థిక స్వావలంబనకు చేయూతనిస్తామని యువనేత భరోసా ఇచ్చారు.

సెల్ఫీ విత్ లోకేష్ కి అనూహ్య స్పందన ప్రతిరోజూ తనను కలుసుకునేందుకు వచ్చిన వేలాదిమంది ప్రజలు, అభిమానులు, కార్యకర్తలను నిరాశపర్చకుండా క్యాంప్ సైట్ లో నిర్వహించే సెల్ఫీ విత్ లోకేష్ కార్యక్రమానికి అనూహ్య స్పందన లభిస్తోంది. ప్రతిరోజు 1500 నుంచి 2000 మందితో యువనేత ఫోటోలు దిగుతున్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 16రోజులపాటు జరిగిన పాదయాత్రలో 25వేలమందికి పైగా యువనేతను కలిసి ఫోటోలు దిగారు. యువనేతతో ఫోటోలు దిగిన అభిమానులకు వారి ఫోన్లకే ఫోటోలు వెళ్లేవిధంగా అధునాతన ఫ్రీ మెజిక్ ఫేస్ రికగ్నిషిన్ టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చారు. దీనిద్వారా ఫోటోలు దిగిన అభిమానులు తమ ఫోటోకోసం వెదుక్కునే అవసరం లేకుండా పాదయాత్రలో ఇచ్చే కార్డును స్కాన్ చేసినట్లయితే ఫోన్ కే వచ్చేస్తుంది. ఒంగోలు, అద్దంకి వంటి పట్టణాల్లో 2వేలమందికి పైగా ఫోటోలు దిగడం చూస్తే యువనేతపై ప్రజల్లో నెలకొన్న క్రేజ్ కు అద్దంపడుతోంది.

Optimized by Optimole