పవన్ నటన అద్భుతం : మెగాస్టార్ చిరంజీవి

మూడేళ్లయినా తనలో వాడి వేడి ఏ మాత్రం తగ్గలేదని పవన్ ‘వకీల్ సాబ్’ తో నిరూపించాడని మెగాస్టార్ చిరంజీవి పేర్కొన్నారు. శుక్రవారం రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి వకీల్ సాబ్ చిత్రాన్ని వీక్షించారు. అనంతరం ఆయన సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. మూడేళ్ల తర్వాత పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ కం బ్యాక్ ఇచ్చారన్నారు. పవన్ నటన అద్భుతం.. ప్రకాష్రాజ్ నివేదాథామస్ అంజలి అనన్య వాళ్ళ పాత్రల్లో జీవించారు. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సినిమాటోగ్రాఫర్ వినోద్ సినిమాకు ప్రాణం పోశారు.. మహిళలకు ఇవ్వాల్సిన గౌరవాన్ని తెలియజేసే అద్భుత చిత్రమని మెగాస్టార్ కొనియాడారు.
మరో మెగా బ్రదర్ నాగబాబు స్పందిస్తూ.. మూడేళ్ల అభిమానుల నిరీక్షణకు వకీల్ సాబ్, జీవితకాలానికి సరిపడే విందు అందించాడన్నారు. నేటి సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న క్లిష్టమైన సమస్య, ప్రతి ఒక్కరని ఆలోచింపజేసిందని అన్నారు.మెగా మేనల్లుడు సాయి ధరంతేజ్ స్పందిస్తూ.. కళ్యాణ్ నటన అద్భుతంగా ఉంది. అబ్జెక్షన్! అబ్జెక్షన్! అబ్జెక్షన్! అంటూ పవర్ ప్యాక్డ్ పర్ఫామెన్స్ చేశారని అన్నారు. సరైన సమయంలో సరైన సినిమాలో సరైన వ్యక్తి నటించారని సాయి తేజ్ అన్నారు.మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ స్పందిస్తూ.. కళ్యాణ్ బాబాయ్ నటన పవర్ ప్యాక్డ్ గా ఉంది. నివేదా, అంజలి అనన్య ల నటన ప్రతి ఒక్కరినీ ఆకట్టుకునేలా సాగింది. తమన్ మ్యూజిక్ అదిరిపోయింది అని వరుణ్ అన్నారు.

Optimized by Optimole