Loksabha2024: సోనియా రాజ్యసభకు పోతే..ఖమ్మం టికెట్ రేణుకా చౌదరికి ఇస్తారా?

Nancharaiah merugumala senior journalist:

‘ సోనియా రాజ్యసభకు పోతున్నారు కాబట్టి ఖమ్మం కాంగ్రెస్ టికెట్ రేణుకా చౌదరి వంటి భారీ కమ్మ నేతకు ఇస్తారా? ‘

మాజీ ఎంపీ రేణుకచౌదరి గారు పోటీకి దిగకుండా చేయడానికి..తెలంగాణ కాంగ్రెస్ ‘ అగ్ర నేతలు ‘ పార్టీ మాజీ అ్యక్షురాలు సోనియాగాంధీని ఖమ్మం నుంచి బరిలోకి దిగాలని అభ్యర్థించారు. చివరికి సోనియమ్మ ఈరోజు హిమాచల్ ప్రదేశ్ లేదా రాజస్థాన్ నుంచి రాజ్యసభకు నామాంకన పత్రాలు దాఖలు చేస్తారని ఇప్పుడే వార్త వచ్చింది. తెలంగాణలో కమ్మ నాయకులు తప్పక గెలిచే అవకాశాలున్న ఖమ్మం సీటు నుంచి రేణుకమ్మ  వంటి భారీ కమ్మ నేత పోటీ చేయకుండా వేసిన ఖమ్మం కాంగ్రెస్ నేతల ఎత్తుగడ ఫలించినట్టు కనిపిస్తోంది. సోనియమ్మ వద్దని రాజ్యసభకు పోతున్నారు కాబట్టి దళిత ఉప ముఖ్యమంత్రి భార్యను (నందినీ మల్లు?) ఖమ్మం నుంచి గెలిపించాలని ఇక పాట ఎత్తుకుంటారు తెలివైన కాంగ్రెసోళ్లు. మధిర ఎమ్మెల్యే భట్టి విక్రమార్క మల్లు రెండో అన్న డా. మల్లు వెంకటేశ్వర్లు గారు మంగళారం  కన్నుమూశారు అని తెలిసిన తర్వాత ఇలాంటి పోస్టు పెట్టడం సబబు కాదు. అదీగాక హోమియోపతి డాక్టర్ అయిన వెంకటేశ్వర్లు గారు మా గుడివాడ ప్రభుత్వ హోమియోపతి కాలేజీలో, ప్రభుత్వాసుపత్రిలో ఎన్నో ఏళ్లు పని చేశారు. కానీ, సోనియా రాజ్యసభకు పోతున్నారని తెలిశాక ఈ మాటలు రాయాలనిపించింది.

Optimized by Optimole