ఆప్ మాజీమంత్రి కి రెండేళ్ల జైలు శిక్ష!

ప్రభుత్వ ఆస్తికి నష్టం కలిగించిన కేసులో ఓ మాజీమంత్రికి రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ, ఢిల్లీ కోర్టు తీర్పునిచ్చింది. వివరాల్లోకి వెళితే.. ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఎమ్మెల్యే ,ఢిల్లీ మాజీమంత్రి సోమ్ నాథ్ భారతి 2016లో అఖిల భారతవిజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) సిబ్బంది పై దాడి చేయడంతో పాటు ప్రభుత్వ ఆస్తికి నష్టం కలిగించినట్లు నిర్దారణ కావడంతో ఈ మేరకు అదనపు చీఫ్ మెట్రో పాలిటన్ మేజిస్ట్రేట్ రవీంద్రపాండే శనివారం స్పష్టం చేస్తూ లక్ష జరిమానా విధించారు. అనంతరం కోర్టు భారతికీ  బెయిల్ మంజూరు చేసింది. కేసుకు సంబంధించి హైకోర్టులో  పిటీషన్ దాఖలు చేసుకోవచ్చని పేర్కొంది.

2016లో మాజీమంత్రి భారతీ తన 300 మంది అనుచర వర్గంతో ఎయిమ్స్ ప్రహరీ గోడమీద ఉన్న ఫెంనిగ్స్ ధ్వంసం చేసినట్లు కోర్టులో కేసు నమోదయ్యింది. అంతేకాకుండా అనుచర అడ్డుకునేందుకు వచ్జిన సిబ్బందిపై దాడి చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. సోమ్ నాథ్ పై గతంలోనూ ఓ ఆఫ్రికన్ మహిళపై దాడి చేశారన్న ఆరోపణలున్నాయి.

 

Optimized by Optimole