తెలంగాణ ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ , టిఆర్ఎస్ నేత పిడమర్తి రవి శ్రీరాముని పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. శనివారం కరీంనగర్లోని ప్రజా సంఘాలు జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజా పరిరక్షణ కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో గత రెండు రోజుల నుండి చందాల దందా మొదలైందని.. అయోధ్య రామ మందిర నిర్మాణ విరాళాల కోసం బిజెపి నేతలు బెదిరింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. రానున్న రోజుల్లో దేశంలో జై భీమ్ _ జై శ్రీరామ్ నినాదాల మధ్య యుద్ధం జరగనుందన్నారు.
శ్రీ రాముని గురించి ఆయన మాట్లాడుతూ.. రాముడి జన్మస్థలం తమ దగ్గర అని నేపాల్ ప్రధాని మాటలను గుర్తు చేస్తూ.. రాముడు జన్మస్థలం ఎక్కడో తేలాల్సి ఉందని అన్నారు.
భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సమస్యల గురించి మాట్లాడకుండా.. గుళ్ళూ గపురాలు అంటూ టిఆర్ఎస్ ను విమర్శించడం సరికాదన్నారు. దళితులు హిందువులైతే ఆలయ ప్రవేశం ఎందుకు నిరాకరిస్తున్నారనీ ప్రశ్నించారు. ఇక ఆ సమయంలో లో వేదిక పై ఉన్న భాజపా నాయకుడు కల్పించుకుని ఇది రాజకీయ వేదిక కాదని.. బండి సంజయ్ పై విమర్శలు తగవని హెచ్చరించారు.