Telangana: వినాశనానికి బ్రాండ్ అంబాసిడర్ అన్నట్టుగా ఆ సంక్షేమ పథకాలు..!

కిరణ్ రెడ్డి వరకాంతం: 2018 అసెంబ్లీ ఎన్నికల్లో రైతు బంధు పథక ప్రయోగం బీఆర్ఎస్ పార్టీకి ఫుల్ సక్సెస్ నిచ్చింది.ఆ పథకం ప్రభావం పార్టీని అధికారంలోకి తీసుకురావడమే కాదు…వ్యతిరేకతను పక్కకు నెట్టి 88 సీట్లతో ఘన విజయాన్ని అందించి పెట్టింది.ఇక రైతు బంధు పథకం ఎంత సక్సెస్ అయ్యిందో….దళిత బంధు అంత అట్టర్ ప్లాప్ అయ్యింది.సొంత పార్టీ నేతలే ఒప్పుకున్న వాస్తవమిది.దళిత బంధు లబ్ధిదారుల ఎంపికలో అప్పటి అధికార పార్టీ నేతల చేతివాటాలు గులాభి పార్టీ కొంప ముంచింది.పార్టీ కార్యకర్తలే లబ్ధిదారులుగా ఎంపికవ్వడం కూడా అసలుకే ఎసరు తెచ్చింది.మొత్తానికి ప్రయోగాత్మకంగా తెచ్చిన దళిత బంధు పథకం కారు యాక్సిడెంట్ అయ్యేలా చేశాయి.ఇక సరిగ్గా ఇలాంటి పథకమే హస్తం పార్టీ నాశనానికి బాటలు వేసింది.

ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం.అర్హులైన పేద,మద్య తరగతి ప్రజలందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలన్నది స్కీం ముఖ్య ఉద్దేశం.కానీ పథకం పక్కదారి పడుతుందన్న విమర్శలు బహిరంగంగానే వినబడుతున్నాయి.ఇక్కడా..అక్కడా అని తేడా లేదు చాలా చోట్ల ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికలో అవతతవకలు జరుగుతున్నాయనే ఆరోపణలు హల్చల్ చేస్తున్నాయి.భువనగిరి సెగ్మెంట్ లో ఇందిరమ్మ ఇండ్ల ఎంపిక లో ఓ లబ్ధిదారుడి నుంచి కాంగ్రెస్ కార్యకర్త చేతివాటం చూపడం అవినీతికి నిదర్శనంగా నిలుస్తుంది.ఇది ఒక్క ఉదాహరణ మాత్రమే.చాలా చోట్ల పరిస్థితి ఇదే.గ్రామాల్లో పలుకుబడి ఉన్న అధికార పార్టీ లీడర్లే లబ్ధిదారుల ఎంపిక చేస్తున్నారన్నది ఓపెన్ సీక్రెట్.పార్టీ కోసం పనిచేసిన వారు,తమ చెప్పు చేతల్లో ఉండే వారు,చేయి తడిపిన వారే లబ్ధిదారులుగా ఎంపిక అవుతున్నారన్న చర్చ జోరందుకుంది.ఇక ఇండ్ల నిర్మాణంలో ప్రభుత్వం పెడుతున్న కొర్రీలు సైతం లబ్ధిదారులకు తలనొప్పులు తెచ్చిపెడుతుంది.వెరసి ఇందిరమ్మ ఇండ్ల పథకం ఫెయిల్యూర్ పథకంగా మారుతోంది.అంతిమంగా బీఆర్ఎస్ పార్టీని దళిత బంధు డ్యామేజ్ చేసినట్టుగా….హస్తం పార్టీకి ఇందిరమ్మ ఇండ్ల పథకం కొంప ముంచేట్టు ఉందన్న విశ్లేషణలు మొదలయ్యాయి.ఓవరాల్ గా ఈ పథకం లాభం కంటే నష్టమే ఎక్కువందన్న అభిప్రాయం సైతం ఆ పార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది.

Optimized by Optimole