Crime: పూణే అత్యాచార ఆరోపణ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి…!

పుణె: మహారాష్ట్రలోని పూణేలో చోటుచేసుకున్న అత్యాచారం కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఐటీ కంపెనీలో పనిచేస్తున్న 22ఏళ్ల యువతి తనపై కొరియర్ డెలివరీ ఏజెంట్ అత్యాచారం చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది.ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు 10 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి విచారణ చేపట్టారు. అయితే దర్యాప్తులో అసలు కథ వెలుగులోకి వచ్చింది. యువతి చేసిన ఆరోపణల్లో అసలు డెలివరీ బాయ్ అనే ఎలిమెంట్ లేదని, ఆమెకు బాగా పరిచయమైన ఓ స్నేహితుడినే ఇంటికి పిలిచి, ఆ తర్వాత జరిగిన విషయాలను వక్రీకరించి అత్యాచార ఆరోపణలు మోపినట్లు పోలీసుల దర్యాప్తులో స్పష్టమైంది.

వారు గతంలోనే పలుమార్లు కలిసినవారే అని పోలీసులు గుర్తించారు. ఆ రోజు లైంగిక సంబంధం తనకు ఇష్టంలేదని, అయినా స్నేహితుడు బలవంతం చేశాడని యువతి వెల్లడించినట్లు తెలిసింది. కోపంతోనే అతనిపై తాను డెలివరీ బాయ్ ముసుగులో ఆరోపణలు చేసినట్లు ఆమె విచారణలో ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా, “మళ్లీ వస్తాను” అంటూ ఇంట్లో రాసిన మెసేజ్ కూడా బాధితురాలే రాసినట్లు ఫోరెన్సిక్ విచారణలో తేలిందని సమాచారం. సెల్ఫీ కూడా ఆమె తీసినట్లు ఆధారాలు ఉన్నాయని పోలీసులు వెల్లడించారు.

ఇక యువతి ఫిర్యాదులో… డెలివరీ బాయ్ ఇంట్లోకి ప్రవేశించి, తనపై స్ప్రే చల్లి, అనంతరం అత్యాచారం చేశాడని చెప్పింది. అంతేకాకుండా, నిందితుడు సెల్ఫీ తీసుకుని “మళ్లీ వస్తాను” అంటూ వెళ్లిపోయాడని వెల్లడించడం గమనార్హం.

Optimized by Optimole