యూపీలో ప్రారంభమైన తొలివిడత పోలింగ్!

దేశంలో అత్యధిక దేశంలో అత్యధిక అసెంబ్లీ స్థానాలు గల యూపీలో తొలి విడత ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది.ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు.. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల ముందు బారులుతీరారు.

కాగా మొదటి విడతలో భాగంగా 11 జిల్లాల్లోని 58 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. 2.27 కోట్ల మంది ఓటర్లు 623 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఈవీఎంలలో నిక్షిప్తం చేయనున్నారు.

మోదీ ట్వీట్..
యూపీ తొలి విడత ఎన్నికల వేళ ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. ఓటర్లందరు ఉత్సాహంగా ఎన్నికల పండగలో పాల్గొనాలని ప్రధాని విజ్ఞప్తి చేశారు.

ఇక కరోనా నేపథ్యంలో ఎన్నికల సంఘం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. పోలింగ్ కేంద్రాల వద్ద భౌతిక దూరం పాటించడం, మాస్కు ధరించడం తప్పనిసరి చేసింది. ఎన్నికల దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ఠ భద్రత ఏర్పాటు చేసింది ఈసీ. పోలింగ్ కేంద్రాల వద్ద 50 వేలమంది పారామిలిటరీ సిబ్బందిని మోహరించింది.

Optimized by Optimole