కర్ణాటకలో ముదిరిన హిజాబ్ వివాదం!

కర్ణాటకలో ముదిరిన హిజాబ్ వివాదం!

కర్ణాటకలో హిజాబ్ వివాదం అంతకంతకు తీవ్రమవుతుంది. రాష్ట్రవ్యాప్తంగా హిజాబ్ కుఅనుకూల, వ్యతిరేకంగా విద్యార్థులు చేపట్టిన ఆందోళనలు పలు చోట్ల ఉద్రిక్తకు దారితీసింది. దీంతో విద్యా సంస్థలకు మూడు రోజులు సెలవు ప్రకటిస్తున్నట్లు సీఎం బస్వరాజు బొమ్మై ఆదేశాలు జారీ చేశారు.
అటు హిజాబ్ అంశంపై కర్ణాటక హైకోర్టులో విచారణ జరిగింది. ఈమేరకు ప్రజలు, విద్యార్థులు సంయమనం పాటించాలని ధర్మాసనం సూచించింది. కొందరు అల్లరిమూకలు సమస్యను జఠిలం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. విద్యార్థులు ఒకరిపై మరొకరు దాడి చేసుకోవడం మంచిది కాదని పేర్కొంది. తదుపరి విచారణ సోమవారంకి వాయిదా వేసింది.

ఇటు శివమొగ్గ లోని ప్రభుత్వం డిగ్రీ కళాశాలలో ఇరువర్గాల విద్యార్థులు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకోగా పలువురు గాయపడ్డారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. కాషాయ శాలువాలు ధరించిన విద్యార్థులను కాలేజ్​లోకి అనుమతించకపోవడంతో వారు నిరనసనకు దిగారు. ఈ నేపథ్యంలో మరో వర్గం విద్యార్థులు అక్కడకు రావడంతో హింసకు దారితీసిందని స్ధానికులు వెల్లడించారు.