కమిన్స్ విధ్వంసం.. కోల్ కత్తా ఘన విజయం!

ఐపీఎల్ తాజా సీజన్లో కోల్‌కతా నైట్ రైడర్స్ వరుస విజయాలతో దూసుకుపోతోంది. బుధవారం జరిగిన మ్యాచ్లో.. ముంబయి నిర్దేశించిన 162పరుగుల లక్ష్యాన్ని 16 ఓవర్లలోనే ఛేదించి కోల్ కత్తా జట్టు 5 వికెట్లు తేడాతో గెలుపొందింది.

అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత ఓవర్లలో 161 పరుగులు చేసింది. ఆ జట్టులో సూర్యకుమార్ యాదవ్‌ (52 : 36 బంతుల్లో) అర్ధ శతకంతో మెరిశాడు. తిలక్ వర్మ (38 : 27 బంతుల్లో ), డెవాల్డ్ బ్రెవీస్‌ (29 : 19 బంతుల్లో ) కీలక ఇన్నింగ్స్‌ ఆడారు. కోల్‌కతా బౌలర్లలో ప్యాట్ కమ్మిన్స్‌ రెండు, ఉమేశ్‌ యాదవ్‌, వరుణ్‌ చక్రవర్తి తలా ఓ వికెట్ పడగొట్టారు.

అనంతరం 162 పరుగుల లక్ష్యాన్ని కోల్ కత్తా జట్టు 5 వికెట్లు కోల్పోయి చేధించింది. ఆ జట్టులో ఓపెనర్‌ వెంకటేశ్ అయ్యర్ (50), ప్యాట్‌ కమ్మిన్స్ (56) అర్థ శతకాలతో మెరిశారు. ముంబయి బౌలర్లలో టైమల్ మిల్స్‌, మురుగన్ అశ్విన్ చెరో రెండు వికెట్లు పడగొట్టగా.. డేనియల్‌ సామ్స్‌ ఒక వికెట్ పడగొట్టారు.

Related Articles

Latest Articles

Optimized by Optimole