ఎట్టకేలకు బోణీ కొట్టిన సన్ రైజర్స్ హైదరాబాద్!

ఐపీఎల్ తాజా సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఎట్టకేలకు బోణీ కొట్టింది. చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన పోరులో హైదరాబాద్ జట్టు 155 పరుగుల లక్ష్యాన్ని కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించి ఘన విజయం సాధించింది. ఓపెనర్ అభిషేక్ శర్మ (75) జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. కాగా చెన్నై జట్టుకు ఈ సీజిన్లో వరుసగా నాలుగో ఓటమి కావడం గమనార్హం.

అంతకుముందు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న హైదరాబాద్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 154 పరుగులు చేసింది. ఆ జట్టులో మొయిన్ అలీ 48 పరుగులతో రాణించాడు. సన్ రైజర్స్ బౌలర్లలో నటరాజన్, సుందర్ చెరో రెండు వికెట్లు తీయగా.. భువనేశ్వర్, జాన్సన్, ఐడెన్ మార్కాం తలా ఓ వికెట్ దక్కించుకున్నారు.
అనంతరం 155 పరుగుల లక్ష్యాన్ని హైదరాబాద్ జట్టు .. 17.4 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి చేదించింది. అభిషేక్ శర్మ (75: 50 బంతుల్లో) ధనాధన్ ఇన్నింగ్స్ తో అదరగొట్టాడు. అతనికి కెప్టెన్ విలియమ్సన్ (40 బంతుల్లో 32 పరుగులతో)చక్కటి సహకారం అందించాడు. చెన్నై బౌలర్లలో ముకేశ్ చౌదరి, డ్వేన్ బ్రేవో చెరో వికెట్ తీశారు.