ఐపీఎల్ తాజా సీజన్లో కోల్‌కతా నైట్ రైడర్స్ వరుస విజయాలతో దూసుకుపోతోంది. బుధవారం జరిగిన మ్యాచ్లో.. ముంబయి నిర్దేశించిన 162పరుగుల లక్ష్యాన్ని 16 ఓవర్లలోనే ఛేదించి కోల్ కత్తా జట్టు 5 వికెట్లు తేడాతో గెలుపొందింది.
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత ఓవర్లలో 161 పరుగులు చేసింది. ఆ జట్టులో సూర్యకుమార్ యాదవ్ (52 : 36 బంతుల్లో) అర్ధ శతకంతో మెరిశాడు. తిలక్ వర్మ (38 : 27 బంతుల్లో ), డెవాల్డ్ బ్రెవీస్ (29 : 19 బంతుల్లో ) కీలక ఇన్నింగ్స్ ఆడారు. కోల్‌కతా బౌలర్లలో ప్యాట్ కమ్మిన్స్ రెండు, ఉమేశ్ యాదవ్, వరుణ్ చక్రవర్తి తలా ఓ వికెట్ పడగొట్టారు.
అనంతరం 162 పరుగుల లక్ష్యాన్ని కోల్ కత్తా జట్టు 5 వికెట్లు కోల్పోయి చేధించింది. ఆ జట్టులో ఓపెనర్ వెంకటేశ్ అయ్యర్ (50), ప్యాట్ కమ్మిన్స్ (56) అర్థ శతకాలతో మెరిశారు. ముంబయి బౌలర్లలో టైమల్ మిల్స్, మురుగన్ అశ్విన్ చెరో రెండు వికెట్లు పడగొట్టగా.. డేనియల్ సామ్స్ ఒక వికెట్ పడగొట్టారు.