ఉత్తరప్రదేశ్ గోరఖ్ నాథ్ ఆలయం వెలుపల ఘటనలో విస్తుగొలిపే విషయాలు వెలుగులోకి వచ్చాయి. గోరఖ్ నాథ్ ఆలయంపై దాడికి పాల్పడిన వ్యక్తి మానసిక రోగి కాదని.. ఉద్దేశపూర్వకంగానే దాడికి పాల్పడినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. నిందితుడు అహ్మద్ ముర్తాజా అబ్బాసీ.. మొబైల్, ల్యాప్ టాప్ లను పరిశీలించగా.. ఐసీస్ వంటి పలు ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నట్లు పోలీసుల గుర్తించారు. అంతేకాక ఉగ్రదాడులకు సంబంధించిన వీడియోల కోసం అతను సెర్చ్ చేసేవాడని.. ముంబై, నేపాల్ లో పలువురితో సంబంధాలు ఉన్నట్లు ఆధారాలు లభించాయని పోలీసులు తెలిపారు.
కాగా నిందితుడు అబ్బాసీ.. ఇస్లామిక్ స్టేట్‌కు విరాళాలు ఇస్తున్నాడని.. ఐఎస్‌ఐఎస్ కోసం సిరియాకు కూడా డబ్బులు పంపాడని.. అందుకు సంబంధించిన లావాదేవీలు సైతం దొరికినట్లు పోలీసులు పేర్కొన్నారు.
ఇక గోరఖ్ నాథ్ ఆలయం వెలుపల ఆదివారం రాత్రి అహ్మాద్ ముర్తాజా అబ్బాసీ కత్తిపట్టుకుని మతపమైన నినాదాలు చేస్తు స్థానికులపై దాడికి తెగబడిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో స్థానికుల సహాయంతో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.