ఐపీఎల్ 15 వ సీజన్లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టు పరాజయాల పరంపర కొనసాగుతోంది. ఆదివారం జరిగిన పోరులో పంజాబ్ నిర్దేశించిన 181 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించలేక 126 పరుగులకే చెన్నై చేతులెత్తేసింది. దీంతో 54 పరుగుల తేడాతో పంజాబ్ జట్టు విజయం సాధించింది.
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన పంజాబ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 181 పరుగులు చేసింది. ఆ జట్టులో చలియామ్ లివింగ్ (60) స్టోన్ హాఫ్ సెంచరీతో మెరిశాడు. ఓపెనర్ శిఖర్ ధావన్ (33), జితేశ్ శర్మ (26) ఫర్వాలేదనిపించారు. చెన్నై బౌలర్లలో ప్రిటోరియస్ 2, జొర్డాన్ 2.. ముకేశ్ చౌదరి, రవీంద్ర జడేజా, బ్రావో తలో వికెట్ తీశారు.
అనంతరం 180 పరుగులు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన చెన్నై జట్టు.. పంజాబ్ బౌలర్ల ధాటికి 126 పరుగులకే కుప్పకూలింది. చెన్నై బ్యాటర్లలో శివమ్ దూబే (57) అర్థ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ధోనీ (23) ఫర్వాలేదనిపించాడు. పంజాబ్ బౌలర్లలో రాహుల్ చాహర్ 3, వైభవ్ అరోరా 2, లివింగ్‌స్టోన్ 2.. రబాడ, అర్ష్‌దీప్ సింగ్, ఓడియన్ స్మిత్ తలో వికెట్ పడగొట్టారు.