చెన్నై అభిమానులకు గుడ్ న్యూస్!

ఐపీఎల్​ 2022లో టోర్నీలో వరుస ఓటములతో సతమవుతున్న డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకి గుడ్ న్యూస్. వేలంలో భారీ ధరకు కొనుగోలు చేసిన ఫాస్ట్ బౌలర్ దీపక్ చహర్ త్వరలో జట్టులో చేరే అవకాశం ఉంది. ఇప్పటికే అతడు నెట్​ ప్రాక్టీస్​ సైతం మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. కాగా అతనిని చెన్నై జట్టు వేలంలో రూ.14 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.

కాగా గత సీజన్లో చెన్నై జట్టు విజేతగా నిలవడంలో దీపక్ చహార్ కీ రోల్ ప్లే చేశాడు. అయితే ఈ సీజన్ కు ముందు అతను గాయపడటంతో మొదటి రెండు మ్యాచ్ లకు దూరమయ్యాడు. అతను లేనిలోటు జట్టులో స్పష్టంగా కనిపించింది. లక్ నవూ మ్యాచ్లో 211 పరుగుల భారీ స్కోర్ చేసిన బౌలర్లు తెలిపోవడంతో చెన్నై జట్టు ఓటమి చవిచూసింది.

ఇక కొత్త కెప్టెన్ రవీంద్ర జడేజా సారథ్యంలో మొదటి రెండు మ్యాచ్లో ఓడినా చెన్నై జట్టు.. చహార్ రాకతో గెలుపు బాట పట్టాలని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. చెన్నై తదుపరి మ్యాచ్ పంజాబ్ కింగ్స్ తో తలపడనుంది.