రాజ్యసభలో మోదీ భావోద్వేగం!

రాజ్యసభలో మంగళవారం ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ విపక్ష సభ్యులు గులాం నబీ ఆజాద్ పదవి సందర్భంగా ప్రధాని మోదీ భావోద్వేగానికి గురయ్యారు. అధికారం, పదవులు వస్తుంటాయ్, పోతుంటాయ్, వ్యక్తిగా ఎలా ఉండాలో ఆజాద్ ని చూసి నేర్చుకోవాలని ఆయన అన్నారు. నేను రాజకీయాల్లోకి రాకముందు నుంచి ఆజాద్ తెలుసని, కాశ్మీర్ లో గుజరాత్ యాత్రికులపై దాడి జరిగినపుడు ఫోన్ చేసి కన్నీటి పర్యంతంమయ్యారని మోదీ గుర్తుచేశారు. ఆజాద్ గొప్ప స్నేహితుడు, ప్రతి ఒక్కరినీ కుటుంబ సభ్యుడిగా చూస్తాడని ప్రసంగిస్తూ ప్రధాని భావోద్వేగానికి గురయ్యారు.

కాగా రాజ్యసభలో ఆజాద్ స్థానాన్ని ఎవరు భర్తీ చేయలేరని,పార్టీ కోసమే కాకుండా దేశం కోసం కృషి చేసే వ్యక్తి అని మోదీ ప్రశంసించారు. ఆయన సలహాలు సూచనలు దేశానికి ఎంతో అవసరమని ప్రధాని అన్నారు.

హిందూస్థానిగా గర్వపడుతున్నా..

హిందుస్థానీ గా గర్వపడుతున్నట్లు ఆజాద్ పేర్కొన్నారు. అదృష్టవశాత్తు పాకిస్తాన్ వెళ్లలేదు, అక్కడికి వేళ్ళని వారిలో తాను ఒకరిని అని ఆజాద్ తెలిపారు. సభలో ఎలా నడుచుకోవాలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి నుంచి నేర్చుకున్నానని ఆయన స్పష్టం చేశారు.

Related Articles

Latest Articles

Optimized by Optimole