కేసీఆర్ ని తక్షణం పదవి నుంచి తొలగించాలి: అరవింద్

సీఎం పదవిని అవమానించిన కేసీఆర్ ని తక్షణం ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించాలని ఎంపీ ధర్మపూరి అరవింద్ డిమాండ్ చేశారు. ఈమేరకు ఆయన గవర్నర్ కి లేఖ రాశారు. సోమవారం ఢిల్లీ చౌకలో ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ పై పార్టీ నేతల్లో విశ్వాసం సన్నగిల్లిందని, మంత్రులు,ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి మార్పు విషయం అందులో భాగమే అని ఆయన అన్నారు. ఇటీవల పార్టీ వరుస ఓటములతో, పార్టీలో వ్యతిరేక గళం వినిపిస్తుండటంతో కెసిఆర్ భద్రతా భావంలో ఉన్నారని అరవింద్ పేర్కొన్నారు. కాగా ఆదివారం పార్టీ కార్యవర్గ సమావేశంలో కేసీఆర్ మాట్లాడుతూ.. సీఎం పదవి కాలి చెప్పుతో సమానమని.. మరో పదేళ్లు ముఖ్యమంత్రి నేనే .. మరోసారి ఈ విషయం గురించి నేతలు ఎవరైన మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించిన విషయం తెల్సిందే.