దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింన పంజాబ్ చండీఘడ్ యూనివర్శిటి నగ్న వీడియో కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది.విద్యార్థులకు సంబంధించిన వీడియోలు లీక్ కాలేదని యూనివర్శిటి యాజమాన్యం వివరణ ఇచ్చింది.వసతి ప్రాంగణంలో 4 వేల మంది విద్యార్థులు ఉంటున్నారని..అందులో ఓ అమ్మాయి కొందరు స్నానం చేస్తుండగా నగ్నవీడియోలు తీసి బాయ్ ఫ్రెండ్ పంపిందని పలువురు విద్యార్థినులు ఆరోపించారు.దీంతో కాలేజీ యాజమాన్యం ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన అధికారులు..ఆరోపణలు ఎదుర్కొంటున్న విద్యార్థినితో పాటు ఆమె బాయ్‌ఫ్రెండ్‌ను అదుపులోకి తీసుకొని విచారించారు. ఆమె స్వీయ వీడియోలను మాత్రమే అతనికి పంపిందని.. ఘటనపై సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్పీ వివేక్ సోని స్పష్టం చేశారు.
కాగా చండీగఢ్ యూనివర్సిటీలో 60 మంది విద్యార్ధినుల న్యూడ్ వీడియోలు లీకయ్యాయంటూ పెద్ద దుమారం చేలరేగింది. వీడియో లీక్ విషయం ప్రచారం కావడంతో కొంతమంది తీవ్ర అస్వస్థతకు గురవడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.అటు విద్యార్థినులు అధికారుల తీరును నిరసిస్తూ భారీ ఆందోళన చేపట్టారు.నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ యూనివర్శిటీ ప్రాంగణంలో బైఠాయించారు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పరిస్థితి అదుపు తప్పడంతో రెండు రోజుల పాటు యూనివర్సిటీకి సెలవులు ప్రకటించారు.ఎలాంటి వీడియోలు లీక్ కాలేదని.. సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారాన్ని నమ్మవద్దంటూ యూనివర్శిటి యాజమాన్యం స్పష్టం చేసింది.
ఇక వీడియో లీక్ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరుపుతున్నామన్నారు మొహలీ ఎస్పీ వివేక్ సోని.ఆరోపణలు ఎదుర్కొంటున్న విద్యార్థిని ఫోన్ ల్యాబ్‌కు పంపించామన్నారు. త్వరలోనే అన్ని వివరాలు వెల్లడిస్తామన్నారు. దయచేసి సంయమనం పాటించాలని.. రూమర్స్ నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు.విచారణకు యూనివర్శిటి పూర్తి స్థాయిలో సహాకరిస్తామని యాజమాన్యం తెలిపినట్లు ఎస్పీ వెల్లడించారు.