దోవల్ ఆఫీస్ పై దాడికి పాక్ కుట్ర!

జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవల్ ఇంటిపై పాక్ ఉగ్రవాదు సంస్థ రెక్కీ నిర్వహించినట్లు తెలుస్తోంది. ఈవిషయాన్ని పోలీసులు అదుపులో ఉన్నా జైషే మహమ్మద్ టెర్రరిస్ట్ మాలిక్ అంగీకరించాడు. పాక్ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ఆత్మాహుతి దాడికి ప్లాన్ చేసినట్లు అధికారులు విచారణలో టెర్రరిస్ట్ వెల్లడించాడని సమాచారం. కాగా ఈ నెల 6వ తేదీన  భారీ ఆయుధాలు కలిగిన ఉన్న కేసులో ఉగ్రవాదిని అనంత్ నాగ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిని విచారించగా పలు ఆసక్తికర విషయాలు వెల్లడించినట్లు పోలీసులు చెబుతున్నారు.

ఇక కుట్రలో భాగంగా  దోవల్ ఆఫీస్ తో పాటు సెంట్రల్ ఇండియా సెక్యూరిటీ ఫోర్సెస్( సీఐఎస్ఎఫ్) వీడియోలు తీసినట్లు విచారణ లో మాలిక్ ఒప్పుకున్నాడని అధికారులు చెబుతున్నారు. దాడిని డాక్టర్ కోడ్ పేరుతో మాలిక్ పాక్ కి సమాచారం అందించనట్లు.. పూల్వామా ఉగ్రదాడితో సంబంధం ఉన్న టెర్రరిస్ట్ సమీర్ తో కలిసి రెక్కీ నిర్వహించినట్టు మాలిక్ విచారణలో వేలాడించాడని అధికారులు పేర్కొన్నారు.

Optimized by Optimole