ఉప్పెన కలెక్షన్ల సునామీ!

మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్ నటించిన ‘ఉప్పెన’ చిత్రం కలెక్షన్ల సునామి సృష్టిస్తుంది. శుక్రవారం విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్ రావడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి దాదాపు పది కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. దీంతో వైష్ణవ్ డెబ్యూ మూవీతో మొదటి రోజు అత్యధిక కలెక్షన్స్ రికార్డ్ సొంతం చేసుకున్నాడు. మొదటి రోజే మంచి కలెక్షన్స్ రాబట్టిన ఈ సినిమా మున్ముందు మరిన్ని రికార్డులను కొల్లగొడుతుందని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి. ప్రముఖ దర్శకుడు సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు తెరకెక్కించిన ఉప్పెన మూవిని మైత్రి మూవీ మేకర్స్ నిర్మించారు. కృతి శెట్టి హీరోయిన్. రాక్స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించాడు. ఎడిటర్ నవీన్ నూలీ ఛాయాగ్రాహకుడుగా శ్యామ్ ఈ చిత్రానికి పనిచేశారు. కాగా మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్తో నిర్మించిన ఉప్పెన చిత్రం థియేట్రికల్ బిజినెస్ 20 కోట్లు చేసింది. ఈ చిత్రం మొదటి రోజే 10 కోట్లు రాబట్టడం తో నిర్మాతలు సేఫ్ జోన్లోకి వెళ్ళారు. ఇక శని ఆదివారాలు శెలవుదినాలు కావడం, వాలెంటైన్స్ డే ఉండడంతో ‘ఉప్పెన’ మరిన్ని రికార్డులు బ్రేక్ చేసే అవకాశం కనిపిస్తుంది.
ప్రపంచవ్యాప్తంగా ఉప్పెన మొదటి రోజు కలెక్షన్స్ వివరాలు..

Naizam : 3.04cr

Ceeded : 1.38 cr

USA : 1.45L

West : 81 L

Guntur : 66 L

Krishna : 62 L

Krishna : 37 L

Ap/ Ts Total: 9 cr ( 15 cr gross)