రాజ్యసభకు ఎంపీ దినేష్ త్రివేది రాజీనామా!

రాజ్యసభకు తృణమూల్ ఎంపీ దినేష్ త్రివేది రాజీనామా చేశారు. ఈ విషయమై ఆయన శుక్రవారం పెద్దల సభలో మాట్లాడుతూ.. పశ్చిమ బెంగాల్ లో జరుగుతున్న హింస నన్ను తీవ్రంగా కలిచివేసింది. ఇక్కడ మౌనంగా కూర్చోవడం కన్నా బెంగాల్ వెళ్లి ప్రజల మధ్య ఉండడం మేలని త్రివేది అన్నారు. అనంతరం రాజీనామా పత్రాన్ని చైర్మన్ వెంకయ్యనాయుడుకి అందిచగా ఆయన ఆమోదించారు. కాగా తృణమూల్ పార్టీ ప్రస్తుతం ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేతిలో లేదని, కార్పొరేట్ వ్యక్తి కనుసన్నల్లో నడుస్తుందని ఆయన పేర్కొన్నారు. గతంలో రెండుసార్లు రైల్వే శాఖ మంత్రిగా పనిచేసిన త్రివేది రెండుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు.