ఎట్టకేలకు దిగొచ్చిన ట్విట్టర్!

విద్వేష పూరిత పోస్టులు, నకిలీ ఖాతాల నిలుపుదల విషయంలో ట్విట్టర్ ఎట్టకేలకు దిగొచ్చింది. బుధవారం కేంద్ర ఐటీ శాఖ కార్యదర్శి తో  సమావేశమైన, ట్విట్టర్  ప్రతినిధుల చర్చల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా దేశంలో పలుచోట్ల రైతులు ఆందోళన చేస్తున్నారు. దీనిపై విద్వేష పూరిత పోస్టులు, నకిలీ ఖాతాల ద్వారా అసత్య ప్రచారాలు చేస్తున్న ఖాతాలను మూసివేయాలని ట్విట్టర్ను కేంద్రం ఆదేశించింది. అయితే కొన్ని ఖాతాలను మాత్రమే నిలిపేసిన ట్విట్టర్ .. భావస్వేచ్ఛకే ప్రాధాన్యం ఇస్తామని తేల్చిచెప్పింది. దీంతో ట్విట్టర్ తీరుపై కేంద్ర మంత్రులు మండిపడ్డారు.ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంతో, ట్విట్టర్ ప్రతినిధులు సమావేశమయ్యారు.

అమెరికాలో అలా.. భారత్లో ఇలా..?

అమెరికాలో కాంగ్రెస్ క్యాపిటల్ హిల్ పై దాడి జరిగినపుడు విద్వేష పూరిత ఖాతాలను వెంటనే తొలగించారు. మరి భారత్ లో కేంద్ర ప్రభుత్వం ఆదేశించిన కూడా అలాంటి ఖాతాలను ఎందుకు తొలగించలేదని ట్విట్టర్ ప్రతినిధులను అధికారులు ప్రశ్నించారు. దేశంలో అశాంతిని సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నా నకిలీ ఖాతాలను వెంటనే తొలగించి, కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ అధికారులు వారిని కోరారు. ఈ నేపథ్యంలో ట్విట్టర్ ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రభుత్వం సూచించిన వాటిలో 97శాతం ఖాతాలను నిలిపివేస్తునట్లు ప్రకటనలో తెలిపింది.