మెగాస్టార్ చిరంజీవికి మరో అరుదైన గౌరవం…

మెగాస్టార్ చిరంజీవికి మరో అరుదైన గౌరవం దక్కింది. నాలుగు దశాబ్దాల పాటు సినీ పరిశ్రమకు చేసిన సేవలకుగాను ఆయన్ను..కేంద్ర ప్రభుత్వం ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ అవార్డుకు ఎంపిక చేసింది. ఈవిషయాన్ని  గోవాలో ప్రారంభమైన 53వ అంతర్జాతీయ భారత చిత్రోత్సవంలో భాగంగా.. కేంద్రసమాచార,ప్రసార మంత్రిత్వ శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ స్వయంగా ప్రకటించారు.ఇప్పటివరకు తెలుగు, హిందీ, తమిళ, కన్నడ భాషల్లో కలిపి….150కిపైగా చిత్రాల్లో మెగాస్టార్ నటించారు. 

ఇక భారతీయ సినిమా వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా….2013 నుంచి ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ అవార్డును ప్రదానం చేస్తున్నారు. ఈ పురస్కారం కింద నెమలి బొమ్మతో కూడిన రజత పతకం, 10లక్షల నగదు, ధ్రువీకరణపత్రం అందజేస్తారు. చిరంజీవికి ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ అవార్డు రావడంపై గవర్నర్ సహా పలువురు ప్రముఖులు అభినందనలు తెలిపారు. ఆయన సోదరుడు జనసేన అధినేత, నటుడు పవన్ కల్యాణ్ ఆనందం వ్యక్తం చేయటంతోపాటు ట్వీటర్ ద్వారా అభినందనలు తెలిపారు.

Related Articles

Latest Articles

Optimized by Optimole