బండి సంజయ్ ఎమోషనల్..

ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ భావోద్వేగానికి గురయ్యారు. కరీంనగర్ బిజెపి కార్యకర్తల కృషితోనే తాను ఎంపీనయ్యానని… బీజేపీ జాతీయ నాయకత్వం రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పజెప్పిందని భావోద్వేగంగా ప్రసంగించారు. కరీంనగర్ గడ్డపై కాషాయం జెండా ఎగరడంతో..దేశం ఆశ్చర్యపోయిందని గుర్తు చేశారు.  బండి సంజయ్ అంటే ఎవరు.. ఎవరికి తెలుసు..ఎవరు ఓటేస్తారని.. హేళన చేసిన వాళ్లకి.. ఎంపీగా పోటీచేసి.. లక్ష ఓట్ల తో గుబగుయ్యమనిపించేలా సమాధానమిచ్చనట్లు సంజయ్ స్పష్టం చేశారు. 

ఇక జాతీయ నాయకత్వ ఆదేశాలతో తెలంగాణలో గడీల పాలన బద్దలుకొట్టేందుకు ప్రజల మధ్య తిరుగుతున్నాని సంజయ్ పేర్కొన్నారు. గులాబీ, పచ్చ జెండాలతో అపవిత్రమైన తెలంగాణను కాషాయ జెండాతో పవిత్రం చేస్తున్నామని సంజయ్ స్పష్టం చేశారు.కేసీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రయ్యాక ఉద్యమకారులను దూరం పెట్టి… ద్రోహులను సంకనేసుకొని తిరుగుతున్నాడన్నారు. బీఆర్ఎస్ ఏర్పాటుతో తెలంగాణకు టీఆర్ఎస్ పీడ విరగడైందని.. తెలంగాణ తల్లికి ద్రోహం చేసిన మూర్ఖుడు కేసీఆర్ అని సంజయ్ ఆగ్రహాం వ్యక్తం చేశారు.

Optimized by Optimole