కొత్త సంవత్సరం వేడుకలు శాంతియుతంగా జరుపుకోవాలి: ఎస్పీరాజేశ్వరి

నల్లగొండ:  నల్గొండ జిల్లా ప్రజలందరికీ  నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ ఎస్పీ రెమా రాజేశ్వరి ప్రకటన విడుదల చేశారు. కొత్త సంవత్సరం వేడుకలను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా చూడాలన్నారు. డిసెంబర్ 31వ తేది రాత్రి 10 గంటల నుంచి  స్పెషల్ డ్రంకెన్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్ల తెలిపారు. డ్రంకెన్ డ్రైవ్ లో పట్టుబడ్డ వారిపై కేసు నమోదు చేసి బైయిండోవర్ చేయడం  జరుగుతుందని ఎస్పీ స్పష్టం చేశారు.

 

కాగా న్యూఇయర్ వేడుకలు నిర్వహించుకునే ప్రజలు ప్రమాదాలకు దూరంగా ఉండాలని ఎస్పీ సూచించారు. ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించి పోలీసులకు సహకరించాలని కోరారు. వేడుకలు నిర్వహించుకునే వారు ఇతరుల మనోభావాలు దెబ్బతినకుండా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు.మద్యం దుకాణాలు, బార్స్ అండ్ రెస్టారెంట్స్ నిర్వాహకులు  ప్రభుత్వo అనుమతించిన సమయపాలన పాటించాలని ఆదేశించారు.డిసెంబర్  31వ తేది రాత్రి 10 గంటల నుంచి స్పెషల్ డ్రంకెన్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఇక వేడుకల్లో ఆర్కెస్ట్రా, డి.జే లు, మైకులు.. బాణసంచా నిషేధమన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని ఎస్పీ రెమా రాజేశ్వరి హెచ్చరించారు. 

 

Related Articles

Latest Articles

Optimized by Optimole