వికారాబాద్: ఉద్యోగ నోటిఫికేషన్లు వేసి ఎక్కడ లేని నిబంధనలు పెట్టి తెలంగాణ నిరుద్యోగ యువతను కేసిఆర్ ప్రభుత్వం మోసం చేస్తోందని ఆరోపించారు పీసీసీ ప్రధాన కార్యదర్శి పట్లోళ్ళ రఘువీర్ రెడ్డి. పోలీస్ నియామకాల్లో .. ఎన్నడూ లేని విధంగా లాంగ్ జంప్ 4 మీటర్లు పెట్టడంతో చాలా మంది యువకులు అర్హత కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు.. 5 ఈవెంట్స్ లో 3 ఈవెంట్స్ లో అర్హత సాధిస్తే మెయిన్స్ రాయడానికి అవకాశం ఉండేదని..సంవత్సరాలుగా వేచి చూసిన రాష్ట్ర యువత ఆశలపై.. ఈ ప్రభుత్వం నీళ్ళు చల్లుతుందని ఆగ్రహాం వ్యక్తం చేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు 7 ప్రశ్నలకు మార్కులు కలిపి రన్నింగ్ లో అర్హత సాధించిన అభ్యర్థులకు మెయిన్స్ అవకాశం ఇవ్వలని డిమాండ్ చేశారు. నిరుద్యోగులకు కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని రఘువీర్ పేర్కొన్నారు.