అమ్మాయికి 18.. అతనికి 61.. ప్రేమ పెళ్లి!

ప్రేమ గుడ్డిది  నానుడి. ఈ జంటను స్టోరీ చూస్తే మీరు నిజంగానే ప్రేమ గుడ్డిది మాత్రమే కాదు.. మూగది.. చేవిటిది అనికూడా అంటారు. తాజాగా వారిద్దరినీ ఓ యూట్యూబర్ ఇంటర్వ్యూ చేశారు. దీంతో ఆజంట ప్రేమ కహానీ సోషల్ మీడియాలో  వైరల్ గా మారింది. ఆ ప్రేమ కహాని ఎంటో మీరు చదివేయండి!

పాకిస్థాన్ కి చెందిన 18 ఏళ్ల ఆశియా..61 ఏళ్ల వృద్ధుడైన రానా శంషాద్ నూ ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఈ ప్రేమ వ్యవహారం గురించి ఆజంట ఓ యూట్యూబ్ చానెల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. వారి మధ్య ప్రేమ ఎలా చిగురించింది.. అది కాస్త పెళ్లికి వరకు వెళ్లింది వంటి వంటి ఆసక్తికర విషయాలను పంచుకుంది.

రానా వ్యక్తిత్వం నచ్చడంతో: ఆశియా
రానాకు ఉన్న ఒక మంచి అలవాటు.. నన్ను అతనితో ప్రేమలో పడేలా చేసింది. పేదరికంలో మగ్గుతున్న ఎంతో మంది అమ్మాయిల పెళ్ళిలను జరిపించడానికి అతను.. నేనుండే ప్రాంతానికి వచ్చేవాడు. దీంతో అతని గురించి చుట్టుపక్కల జనం మాట్లాడుకోవడం విన్నాను. అతని వ్యక్తిత్వం నాకు నచ్చింది. ఈ క్రమంలోనే అతనిని రెండు, మూడు సార్లు కలిశాను. అతనిని వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. అలా వాళ్లిద్దరి పెళ్లి అయినట్లు ఆశియా చెప్పుకొచ్చింది.

పెళ్లి దేవుడు నిర్ణయిస్తాడు: శంషాద్

ఇక ఆశియా గురించి రానా మాట్లాడుతూ.. పెళ్లిని దేవుడు నిర్ణయిస్తాడు. ఇక్కడ మనసులు మాత్రమే కలుస్తాయి. నమ్మకంతో దంపతులు కలిసి జీవిస్తారు. కానీ ఇక్కడ జనాలు..తమ పెళ్లి  గురించి రకరకాలుగా మాట్లాడుకుంటారు. నేను ఆసియని పెళ్లి చేసుకుంటానని చెప్పినపుడు.. తన బంధువులు కూడా ఇష్టానుసారం మాట్లాడారు.. ఎవరి మాటలను వినదలచుకోలేదు మా వివాహంపై మాకు నమ్మకముంది అంటు చెప్పుకొచ్చాడు రానా. ఇక వీరి వివాహం ఎప్పుడు అయ్యిందో మాత్రం చెప్పడానికి ఈ జంట నిరాకరించింది.