రైలు ప్రమాదం.. తప్పించుకున్న కుటుంబం .. వీడియో వైరల్!

రైలు ప్రమాదం.. తప్పించుకున్న కుటుంబం .. వీడియో వైరల్!

భూమిమీద నూకలు ఉంటే బతికి బట్టకట్టడం అంటే ఇదేనేమో.ఓ కుటుంబం కొద్ది తేడాతో ప్రాణాలు దక్కించుకుంది. దీంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. అయితే ప్రయాణికులు ఎవరూ.. ఘటన ఎక్కడ జరిగిందన్నది మాత్రం స్పష్టతలేదు.

 

వీడియో చూసినట్లయితే.. ఓ రైల్వే స్టేషన్ కు కొద్ది దూరంలో సిగ్నల్ ప్రాబ్లమ్ కారణంగా రైలు ఆగింది. దీంతో ఓ కుటుంబం నుంచి రైలు నుంచి దిగింది. అప్పుడే పక్క ట్రాక్ పై 80 కి.మీ స్పీడుతో మరో రైలు వస్తోంది. దీంతో ఆక్షణంలో వారికి ఏం చేయాలో తోచలేదు. చివరికి ట్రాక్ పై పరిగెత్తుతూ త్రుటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఈసంఘటనను వీడియో తీసిన వ్యక్తి ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. దీంతో వీడియో వైరల్ అయ్యింది.

ఈ వీడియోపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ఇలాంటి తొందరపాటు పనులు చేయోద్దంటూ ఓ నెటిజన్ కామెంట్ చేయగా..ఈరోజు మీకు బాగుందంటూ మరో నెటిజన్ కామెంట్ జతచేశాడు. ప్రయాణంలో చిన్న చిన్న తప్పులు ప్రాణాల మీదకు తెస్తాయని జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.