వర్షంలో తడవకుండా మేకలకు రెయిన్ కోట్ .. వీడియో వైరల్

తెలంగాణలో ఎడతెరపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ముప్పుప్రాంతాల్లో ప్రజలు నానాఅవస్థలు పడుతున్నారు. జంతువుల వ్యథ వర్ణానాతీతం. ఈనేపథ్యంలో జంతువుల ఇబ్బంది పడడాన్ని చూసిన ఓ వ్యక్తి వాటికి రెయిన్ కోట్స్ వేశాడు. ఈఘటన జగిత్యాల జిల్లాలో జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇక వివారాల్లోకి వెళితే.. జిల్లాలోని అంతర్గాంకు చెందిన మీనయ్యకు మేకలు ఉన్నాయి. అతను వాటిని రోజూ పొలాలు, గుట్టల్లోకి మేతకు తీసుకెళ్తాడు. అయితే గతవారం నుంచి ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాలకు మేకలను బయటకు తీసుకెళ్లలేకపోయాడు. మేకలను ఎన్ని రోజులు మందలోనే ఉంచాలి.. బయటకు తీసుకెళ్దామని నిర్ణయించుకున్నాడు. అయితే అవి వర్షానికి తడిస్తే ఎలా అని ఆలోచించి వాటికి రెయిన్ కోట్లు కొని వేశాడు. ఇలా చేయడం వల్ల వర్షానికి తవడకుండా ఉండడమే కాకుండా చలిని తట్టుకుంటాయని భావించాడు.ఇక మేకలకు రెయిన్ కోట్లు వేసి తీసుకెళ్తుంటే ఊర్లో వాళ్లు వింతగా చూశారు. వాటిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో వైరల్ అయింది.