బాలీవుడ్ హీరో న్యూడ్ ఫోటోస్ వైరల్.. ఘాటుగా స్పందించిన హీరో!

బాలీవుడ్ హీరో రణ్ వీర్ మరోసారి వార్తల్లో నిలిచారు. తన నటనతో ఎంతో మంది అభిమానుల మనస్సులను గెలుచుకున్న గల్లీబాయ్.. వ్యక్తిత్వ పరంగా ప్రత్యేకతను చాటుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. స్టార్ హీరోయిన్ దీపికా పదుకునేను పెళ్లాడి ఓ ఇండివాడైనా బాజీరావ్ మస్తానీకి సంబంధించిన న్యూడ్ ఫోటోలు సోషల్ మీడియాలో హాల్ చల్ చేస్తున్నాయి. ఈవిషయంపై అతనికి అభిమానులు మద్దతు నిలవగా.. మరికొందరు మాత్రం రకరకాల మిమ్స్, కామెంట్స్ తో రెచ్చిపోతున్నారు.

ఇక అసలు విషయానికొస్తే.. 1972లో కాస్మోపాలిటన్ మ్యాగజైన్ కోసం పాప్ ఐకాన్ బర్ట్ రేనాల్డ్స్‌ న్యూడ్ ఫోటోషూట్ చేశాడు .అతనికి నివాళిగా రణ్ వీర్ న్యూడ్ ఫోటోషూట్ నిర్వహించారు. వివిధ భంగిమల్లో అతడు పలికించిన హావాభావాలను..క్లాసిక్ పెయింటింగ్ లపై ప్లాస్టరింగ్ చేసినట్లు ఫోటోలు కనిపిస్తున్నాయి.

ఇక రణ్ వీర్ న్యూడ్ ఫోటోషూట్ పై నెటిజన్స్ భిన్నంగా స్పందిస్తున్నారు. ఓనెటిజన్.. ఫోటోషూట్ లోని రణవీర్ భంగిమల్లో ఒకదానిని తీసుకుని, మైఖేలాంజెలో క్లాసిక్ పెయింటింగ్ ది క్రియేషన్ ఆఫ్ ఆడమ్‌పై అతికించి, “ది క్రియేషన్ ఆఫ్ రణవీర్ సింగ్” అని రాసుకొచ్చాడు. మరొకరు “నా జీతం మొత్తం స్విగ్గీ ,జొమాటో కోసం ఖర్చు చేశాను’ అంటూ ఫన్నీ కామెంట్ చేశాడు. ఇంకోకరు.. రణవీర్ కార్పెట్‌పై పడుకున్న చిత్రానికి “నేను రాత్రి లైట్ ఆన్ చేసినప్పుడు బొద్దింక.”అంటూ క్యాప్షన్ జోడించాడు.మరోనెటిజన్ నటుడి చిత్రాన్ని స్పైడర్ వెబ్‌లో పోస్ట్ చేస్తూ.. “క్షమించండి, నేను రణ్‌వీర్ సింగ్‌ను ట్రోల్ చేయడానికి ఇక్కడ లేను.  ఈ చిత్రాన్ని ఫన్నీగా భావించాను” అంటూ #ranveerified #ranveersingh అనే హ్యాష్‌ట్యాగ్‌లను జోడించాడు.

నగ్నంగా ఉండటం సులభం ; రణ్ వీర్
నగ్న ఫోటోషూట్ పై రణ్‌వీర్ స్పందిస్తూ.. “నేను శారీరకంగా నగ్నంగా ఉండటం చాలా సులభం. ప్రత్యేకించి కొన్ని ప్రదర్శనలలో మాత్రమే నగ్నంగా ఉన్నానన్నారు. మీరు నా f***ని చూడవచ్చు. నా *** ఆత్మ ఎంత నగ్నంగా ఉంది? వెయ్యి మంది ముందైనా నగ్నంగా ఉండగలను. నేను స**టీ ఇవ్వను.” అంటూ ఘాటుగా స్పందిచాడు.