వర్షకాలంలో పిడుగుల పడడం సర్వసాధారణం. ఈక్రమంలో ఓ చోట రోడ్డుపై ప్రయాణిస్తున్న కారుపై పిడుగు పడింది. ఈదృశ్యాన్ని కారు వెనకలో ప్రయాణిస్తున్న మరో కారులోని వ్యక్తి చిత్రీకరించారు. ఈఘటన అమెరికాలోని ఫ్లోరిడాలో జరిగింది.ప్రస్తుతం పిడుగు పడిన వీడియో ఇంటర్ నెట్లో వైరల్ అయింది.
Passengers? All good. Pickup truck? Fried. Michaelle May Whalen was videoing #lightning over St. Pete last week, but she wasn’t expecting a bolt to strike her husband’s pickup truck right in front of her! #Florida ⚡️ pic.twitter.com/heoPDwQwOB
— Paul Dellegatto⚡️FOX (@PaulFox13) July 5, 2022
ఇక వీడియో గమనించినట్లయితే.. ఎడ్వర్డ్ వేలెన్ అనే వ్యక్తి జూలై 1వ తేదీన సెయింట్ పీటర్స్‌బర్గ్ గాలివానలో కారు నడుపుతున్నాడు. వెనక కారులో అతని భార్య మైఖేల్ ఫాలో చేస్తోంది. ఇంతలో మెరుపుతో పిడుగు ఎడ్వర్డ్ కారుపై పడింది. దీంతో ట్రక్ నుంచి మంటలు, నిప్పురవ్వలు ఎగిసిపడ్డాయి.ఈదృశ్యాలన్ని ఆమె ఫోన్ లో రికార్డు అయ్యాయి. ఈప్రమాదం నుంచి ఎడ్వర్డ్ సురక్షితంగా బయటపడ్డాడు.
ఎడ్వర్ట్ ప్రమాదంపై స్పందిస్తూ.. పిడుగు పడినప్పుడు కారు షేక్ అయ్యింది.వెంటనే తన పెద్ద కుమార్తె భయంతో ఒడిలోకి వచ్చి కూర్చున్నట్లు అతను చెప్పుకొచ్చాడు. వాతావరణ శాస్త్రవేత్త పాల్ డెల్లెగాట్టో ఈవీడియోనూ ట్విట్టర్లో షేర్ చేశాడు. దీంతో సోషల్ మీడియలో వీడియో వైరల్ అయ్యింది.