లతామంగేష్కర్ ను గుర్తుకుతెస్తున్న భామ.. వీడియో వైరల్!

సోషల్ మీడియా ప్రతిభావంతులకు ఓ వరంలా మారింది. ప్రతిభ ఉండి సరైనా ఫ్లాట్ ఫారమ్ దొరకని వారికి ఓ ఆయుధంలా మారింది. ఈక్రమంలో అనాథ ఆశ్రమంలో ఉంటున్న వృద్ధురాలు తన గానంతో లతా మంగేష్కర్ ను గుర్తుకుతెచ్చింది. అచ్చం తనలానే పాడుతూ నెటిజన్స్ ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం భామ పాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

 

ఇక వీడియో గమనించినట్లయితే.. లతా మంగేష్కర్ పాడిన ‘ఆద్మీ ముసాఫిర్ హై’ పాటను ఓవృద్ధురాలు ప్రాణం పెట్టిపాడింది. ఆమె గాత్రానికి చుట్టు ఉన్నవారు ఫిదా అయిపోయారు .ఈనేపథ్యంలో జార్ఖండ్ డిప్యూటీ కలెక్టర్ సంజయ్ కుమార్.. ఆమె పాటకు ముగ్దుడైపోయి వీడియోనూ ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. దీంతో వీడియోకు 6 వేలకు పైగా వ్యూస్ వచ్చాయి. వందలాది మంది లైక్ చేశారు.