ABVp రాజు మరణం ఉద్యమాలకు తీరని లోటు: బండి సంజయ్

Miryalguda: ఏబీవీపీ జాతీయ మాజీ కార్యదర్శి, ఉస్మానియా ముద్దు బిడ్డ కడియం రాజు అకాల మరణం తీరని లోటు అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ అన్నారు. మిర్యాలగూడ సమీపంలోని కొత్తగూడెం గ్రామానికి విచ్చేసిన బండి సంజయ్  కడియం రాజు కుటుంబాన్ని పరామర్శించారు.  అణగారిన వర్గాల అభ్యున్నతికి   కడియం ఎంతగానో కృషి చేశారని కొనియాడారు.  కడియం కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ఈ  సందర్బంగా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మనోహర్ రెడ్డి,  కార్యదర్శి డాక్టర్ ప్రకాష్ రెడ్డి లతో కలిసి మీడియాతో సంజయ్ మాట్లాడారు.”కడియం రాజు  విద్యార్ధి దశ నుండి జాతీయ భావాలు కలిగిన వ్యక్తి. సామాన్య దళిత కుటుంబంలో పుట్టిన కడియం రాజుకు చిన్నప్పటి నుండే జాతీయ విద్యా విధానం, జాతీయ భావాలపట్ల ఆకర్షితుడయ్యారన్నారు సంజయ్. చిన్నతనం నుండి ఏబీవీపీ కార్యకర్తగా ప్రస్తానం మొదలుపెట్టి విద్యార్థి జాతీయ కార్యదర్శి స్థాయి వరకు ఎదిగారన్నారు.  విద్యార్థి ఉద్యమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన కడియం రాజుకు ఉస్మానియా వర్శిటీలో ప్రత్యేక స్థానం ఉందన్నారు. విద్యార్థుల పక్షాన అనేక పోరాటాలు చేశారని.. అనేకసార్లు అరెస్టై, జైలుకు వెళ్లిన వ్యక్తి.. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీల పాత్ర పోషించారని గుర్తు చేసుకున్నారు. కడియం రాజుకు విద్యా విధానంపట్ల ఉన్న ఆసక్తిని గమనించి కేంద్ర ప్రభుత్వం జాతీయ విద్యా విధానంపై ఏర్పాటు చేసిన బోర్డులో సభ్యుడిగా నియమించింది” అని సంజయ్ పేర్కొన్నారు.

You May Have Missed

Optimized by Optimole