దీదీ ప్రమాదవశాత్తు గాయపడింది: ఈసీ

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దాడి విషయమై కేంద్ర ఎన్నికల సంఘం నివేదిక విడుదల చేశారు. దీదీ పై  ఎలాంటి దాడి  జరగలేదని, ప్రమాదవశాత్తు జరిగిందని నివేదికలో పేర్కొంది. దాడి సమయంలో దీదీ వెంట సెక్యూరిటీ సిబ్బంది ఉందని, అందుకు సంబంధించి ఎటువంటి ఆధారాలు లేవని అధికారులు తెలిపారు.  కాగా ఈనెల 10న నందిగ్రామ్ లో  ఎన్నికల  ప్రచారంలో  దీదీ కాలికి గాయం అయినా విషయం తెలిసిందే.. ఈ విషయం లో బీజేపీ ,తృణమూల్ మాటల యుద్ధం చెలరేగడంతో  కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వా న్ని నివేదిక కోరింది.