నాపై కేసులు అసదుద్దీన్ కుట్ర : హీరా గ్రూప్ సిఈఓ నౌహీరా

మహిళా సాధికారత కోసం పోరాడుతున్న అందుకు మజ్లీస్ అధినేత ఓవైసీ తనపై కుట్ర పన్నారని హీరా గ్రూప్ సీఈఓ నౌహీరా షేక్ ఆరోపించారు. తన ఆస్తులను కాజేసేందుకు ఓవైసీ ప్రయత్నిస్తున్నాడని, నోటీసులు సైతం ఇవ్వకుండా తనను ఇరవై తొమ్మిది రోజులు జైల్లో ఉంచారని హీరా ఆరోపించారు. హీరా గ్రూప్ లో ఎలాంటి అవకతవకలు జరగలేదన్నారు. తమ గ్రూపులో పెట్టుబడి పెట్టినా ప్రతి ఒక్కరికి అడిగిన వెంటనే డబ్బులు వెనక్కి ఇచ్చేస్తానని ఆమె వెల్లడించారు. కాగా తనపై ఫిర్యాదు చేసిన 29 మందికి చెల్లింపులు చేశామన్నారు.

జైలు నుంచి విడుదలైన ఆమె తొలిసారి, శనివారం విలేకరులతో మాట్లాడుతూ.. 1998లో హీరా గ్రూప్ స్థాపించబడిందని క్రమేపీ, అంచెలంచెలుగా పబ్లిక్ లిమిటెడ్ స్థాయికి ఎదిగింది అన్నారు. 1.82 లక్షల మంది డిపాజిట్లలో కేవలం 29 మంది ఫిర్యాదుదారులు రూ.లక్ష రూ 5 లక్షలు నష్టపోయామని ఫిర్యాదు చేయగానే వంద కోట్లకు పైగా చెల్లించే కంపెనీలను జప్తు చేయడం తగదన్నారు.

బ్లాక్ మెయిలింగ్ : 

సాఫీగా సాగుతున్న హీరా గ్రూప్ కంపెనీ పై 2012లో అసదుద్దీన్ ఓవైసీ ఫిర్యాదు చేశారని నౌహీరా గుర్తు చేశారు. 2018లో సైతం మరికొన్ని ఫిర్యాదు చేసి, జైలుకు పంపే కుట్రలు పన్నారని ఆమె తెలిపారు. ఈ సమయంలో ని కొందరు బెదిరింపులు వేధింపులకు పాల్పడుతూ 20 కోట్లు రూ 50 కోట్లు ఇవ్వాలంటూ బ్లాక్ మెయిల్ చేశారని తాను పట్టించుకోకపోవడంతో కేసు నమోదు చేశారని చెప్పుకొచ్చారు.

తనపై తన కంపెనీలపై దుష్ప్రచారం చేసిన వారిపై చట్ట పైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నౌహీరా హెచ్చరించారు. తమ గ్రూప్ బాధితుల సంఘం పేరిట చలామణి అయిన సంస్థపై కూడా కోర్టుకు వెళ్తామని, రూ.50 వేల కోట్లు కుంభకోణం అని అసదుద్దీన్ ఓవైసీ అనడం హాస్యాస్పదంగా ఉందని నౌహిరా పేర్కొన్నారు.