మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. తన తల్లి బర్త్ డే సందర్భంగా విషెస్ చెబుతూ చేసిన పోస్ట్ చర్చనీయాంశమైంది. కొద్ది రోజులుగా తన పర్సనల్ లైఫ్ డిస్టర్బ్ అయినట్లు వార్తలు వస్తున్నాయి.. వాటిపై ఎటువంటి క్లారిటీ లేదు. ఈనేపథ్యంలో అతను చేసిన ఎమోషనల్ పోస్ట్ వైరల్ గా మారింది.
ఇక పోస్ట్ ను గమినించినట్లయితే.. హ్యాపీ బర్త్ డే అమ్మ.. ఎన్నికష్టాలు వచ్చిన నీ ప్రేమ వలన అధిగమించగలుగుతున్నాను.. ఎళ్లవేళలా అండంగా ఉంటున్నందుకు థాంక్యూ.. లవ్ యు సోమచ్ .. అంటూ ఎమోషనల్ పోస్ట్ చేశాడు. అయితే దేవ్ పోస్ట్ పై నెటిజన్స్ భిన్నంగా స్పందిస్తున్నారు. మదర్ లవ్ ఈజ్ అన్ కండిషనల్ అంటూ ఓనెటిజన్ కామెంట్ చేయగా.. మరో నెటిజన్ మీకు వచ్చిన కష్టం ఏంటో అందరీకి తెలుసూ దేవ్ అంటూ క్యాప్షన్ జతచేశాడు.
View this post on Instagram
మరోవైపు కళ్యాణ్ దేవ్ నటించిన ‘కిన్నెరసాని’ ఓటీటీలో రిలీజ్ అయి క్రిటిక్స్ ప్రశంసలు అందుకుంది.ఇంతవరకు అతను నటించిన సినిమాలు బాక్స్ ఫీస్ వద్ద ఆశించిన విజయం సాధించలేకపోయాయి. కిన్నెరసానితో దేవ్ సక్సెస్ ట్రాక్ బాటపట్టాడు.