నెపోటిజంపై అలియా హాట్ కామెంట్స్.. బాయ్ కాట్ బ్రహ్మాస్ర హ్యాష్ ట్యాగ్ వైరల్!

బాలీవుడ్ ఇండస్ట్రీని బాయ్ కాట్ సెగ వెంటాడుతోంది. ఇది చాలదన్నట్లు స్టార్ హీరోయిన్స్ చేస్తున్న వ్యాఖ్యలు సినిమా కలెక్షన్లపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. తాజాగా స్టార్ హీరోయిన్ అలియా భట్ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. ఫలానా కుటుంబంలో పుట్టాలని నేను కోరుకున్నానా.. మీకు నచ్చితినే నాసినిమాలు చూడండి లేకపోతే మానేయండి అంటూ ఆమె చేసిన కామెంట్స్ చేసిన వీడియో నెట్టింట్లో హాల్ చల్ చేస్తోంది. దీంతో నెటిజన్స్ .. త్వరలో విడుదలకు సిద్ధంగా ఉన్న బ్రహ్మాస్త్ర్ మూవీని టార్గెట్ చేస్తూ బాయ్ కాట్ బ్రహ్మాస్త్ర హ్యాష్ టాగ్ తో వైరల్ చేస్తున్నారు.

ఇంతకముందు అమిర్ ఖాన్ లాల్ సింగ్ చడ్డా విడుదల సమయంలోనే మూవీ నటి కరీనా కపూర్ ఇదే తరహాలో కామెంట్స్ చేయడంతో సినిమా బాక్స్ ఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఆతర్వాత తప్పుజరిగిపోయిందంటూ క్షమాపణలు చెప్పినా జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇప్పడు అలియా చేసిన కామెంట్స్ తో బ్రహ్మాస్త్ర టీం ఆందోళనలో పడింది. మూవీ విడుదల తేది దగ్గరపడటంతో #boycottbraBrahmāstra హ్యాష్ ట్యాగ్ వైరల్ కావడంతో నిర్మాతలను భయం వెంటాడుతోంది.

ఇక బాలీవుడ్ లో దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణంతో మొదలైన నెపోటిజం రచ్చ చినికి చినికి గాలివానాలా మొదలైంది. బాలీవుడ్ స్టార్ హీరోలే టార్గెట్ గా బాయ్ కాట్ హ్యాష్ ట్యాగ్ తో నెటిజన్స్ రెచ్చిపోతున్నారు. ఇప్పటికే లాల్ సింగ్ చడ్డా నెపోటిజం ధాటికి బోల్తాకొట్టగా.. త్వరలో రానున్న పఠాన్, బ్రహ్మాస్త్ర మూవీస్ విషయంలో ఇదే సీన్ రీపిట్ అయితే పరిస్థితి ఏంటన్న విషయంపై బాలీవుడ్ లో తీవ్ర చర్చ జరుగుతోంది.