Nancharaiah merugumala (senior journalist)
————————/————————————————–
బిహార్ ఓబీసీ వైశ్యుడి (సీతారామ్ కేసరీ) నుంచి పార్టీ అధ్యక్ష పదవిని 1998లో సోనియాగాంధీ గుంజుకున్నారు. 24 సంవత్సరాల తర్వాత ఆమె మారు మనసు పొందారు. కొడుకు రాహుల్ సహకారంతో కాంగ్రెస్ అధ్యక్ష పదవిని తిరిగి ఓబీసీ నేత అశోక్ గహలోత్ కు అప్పగిస్తున్నారు నెహ్రూ-గాంధీ కుటుంబ సభ్యులు.
ప్రస్తుతం రాజస్థాన్ ముఖ్యమంత్రి పదవిలో 2018 నుంచీ కొనసాగుతున్న అశోక్ గహలోత్ ఓబీసీ మాలీ కులానికి చెందిన నేత. మహారాష్ట్రకు చెందిన మహాత్మా జోతీరావు ఫూ లే కూడా ఓబీసీ మాలీ కుటుంబంలోనే పుట్టారు. ఓబీసీ బీజేపీ ప్రధాని నరేంద్రమోదీని ఎదుర్కోడానికి గహలోత్ ను ఏఐసీసీ అధ్యక్షునిగా సోనియమ్మ, ప్రియాంకా వాడ్రా ఎంపిక చేయడం ఓ మోస్తరు “మాస్టారు స్ట్రోకే”.
కుటుంబ పాలన లేదా ఘోర పరివార్ వాద్ అనే కాషాయ శిబిరం దాడిని గహలోత్ ‘ఎన్నిక’ ద్వారా తాత్కాలికంగా కాంగ్రెస్ నాయకత్వం తిప్పికొట్టవచ్చేమో. మరో ఓబీసీ గుజ్జర్ నేత, ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ కు ఇప్పుడైనా రాజస్థాన్ సీఎం పదవి దక్కుతుందేమో చూద్దాం.
Source: Express news