ఓ మతానికి సంబంధించి అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఎమ్మెల్యే రాజాసింగ్ ని బీజేపీ కేంద్ర క్రమ శిక్షణ సంఘం తాత్కాలికంగా సస్పెండ్ చేసింది. ఎందుకో సస్పెండ్ చేయకూడదో వివరణ ఇవ్వాలంటూ 10 రోజులు గడువు విధించింది. ఈ క్రమంలో రాజాసింగ్ మద్దతుగా సోషల్ మీడియాలో #IsupportRajaSingh హ్యాష్ ట్యాగ్ వైరల్ గా మారింది. కేవలం గంటలోనే గోష్ మహల్ ఎమ్మెల్యే మద్దతుగా మిలియన్స్ పైగా ట్వీట్స్ చేశారు నెటిజన్స్.
మరోవైపు ధర్మం కోసం తాను చావడానికైనా సిద్ధమని సవాల్ విసిరారు ఎమ్మెల్యే రాజా సింగ్. హిందూ దేవుళ్లను కించపరిచిన.. మునావర్ ఫారుఖీకి పోలీసుల ఎలా రక్షణ కల్పిస్తారని ప్రశ్నించారు. మునావర్ ఫారుఖికి కౌంటర్ వీడియోలు చేస్తానని ముందే చెప్పానాని.. అందులో భాగంగానే వీడియోను యూట్యూబ్ లో అప్ లోడ్ చేస్తే తొలగించారని మండి పడ్డారు.