నరేష్ తో పెళ్లి.. స్టింగ్ ఆపరేషన్లో పవిత్ర లోకేష్ సంచలన వ్యాఖ్యలు!

నటుడు నరేష్ తో వివాహం పై నటి పవిత్ర లోకేష్ స్పందించారు. కన్నడ మీడియాకు చెందిన ఓ టీవీ ఛానల్ జరిపిన స్టింగ్ ఆపరేషన్లో పవిత్ర సంచలన విషయాలను వెల్లడించారు. నరేష్ తో సహజీవనం చేస్తునట్లు చెప్పుకొచ్చారు. అతని కుటుంబ సభ్యులు తనని ఓ కుటుంబ సభ్యురాలిగా చూశారన్నారు. తమకు కృష్ణ ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఉందన్నారు.  పెళ్లి విషయం పై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని.. ప్రస్తుతానికి  కలిసే ఉంటున్నట్లు ఆమె స్పష్టం చేశారు.

ఇక ఇటీవలే నరేష్ _పవిత్ర కలిసి మహాబలేశ్వర్ లోని ఓ స్వామిజీ ఆశ్రయాన్ని సందర్శించి.. స్వామిజీ ఆశీ
స్సులు తీసుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో వాళ్లిదరి పెళ్లి వార్తలపై రకరకాల ఊహాగానాలు వినిపించాయి. అయితే నరేష్ తన మూడో భార్యకు విడాకులు ఇవ్వకుండానే.. మరో పెళ్లికి సిద్ధమయ్యారని అంటూ సోషల్ మీడియాలో విమర్శలకు వెల్లువెత్తాయి. అటు నరేష్ భార్య రఘుపతిపై పవిత్ర లోకేష్ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఆమె ప్రవర్తన సరిగ్గా ఉంటే.. ఈ సమస్య వచ్చి ఉండేది కాదన్నారు. నరేష్ తో ఉండనని ఆమె తనతో చెప్పినట్లు పవిత్ర చెప్పుకొచ్చారు.

సుఖేంద్ర ప్రదాస్ పెళ్లి అవాస్తవం..

దర్శకుడు సుఖేంద్ర ప్రదాస్ తో తన పెళ్లి వార్తలపై రియాక్ట్ అయ్యారు పవిత్ర. అధికారికంగా వాళ్లిదరకి పెళ్లిజరగలేదన్నారు. ఇద్దరూ కలిసి కొన్నాళ్లు సహజీవనం చేసినట్లు వెల్లడించారు. అతనితో పెళ్లి జరగనప్పడు.. విడాకుల సమస్య ఎందుకు వస్తుందని ఆమె ప్రశ్నించారు.ఇప్పటికీ సుఖేంద్ర కుటుంబ సభ్యులు తనతో సన్నిహితంగా ఉంటారని పవిత్ర స్పష్టం చేశారు.

నరేష్ తో అనుబంధం గురించి..
నరేష్ నిజాయితీ గల వ్యక్తి. అతను తనతో ఎప్పడూ అబధ్దాలు చెప్పలేదన్నారు పవిత్ర. ప్రస్తుతానికి తామిద్దరం సంతోషంగా ఉన్నామని.. నరేష్ వ్యక్తిగతం జీవితంలో తలదూర్చనని ఆమె స్పష్టం చేశారు. నరేష్ భార్య రఘుపతి విషయం గురించి.. తానూ మాట్లాడుకోదల్చుకోవడం లేదని పవిత్ర పేర్కొన్నారు.