పూనమ్ పై విచక్షణ రహితంగా దాడి చేసిన భర్త.. అసలు ఏం జరిగింది..?

బాలీవుడ్లో బోల్డ్ హీరోయిన్ పూనమ్ పాండే మరోసారి వార్తల్లో నిలిచారు. తన భర్త సామ్ అహ్మద్ శారీరకంగా వేధిస్తున్నాడని ఆమె పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సామ్ పై గృహా హింస కింద కేసు నమోదు చేశారు. కాగా బాలీవుడ్లో బోల్డ్ సినిమాలతో పాపులర్ అయిన పూనమ్ ..సామ్ తో డేటింగ్ అనంతరం సెప్టెంబర్ 9 న వివాహ బంధం తో ఒక్కటయ్యారు. పెళ్లి అనంతరం ఓ సినిమా షూటింగ్ కోసం గోవా వెళ్లిన ఈ జంట మధ్య గొడవలు తలెత్తాయి. దీంతో భర్తపై పూనమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో భార్యాభర్తలకు ఇద్దరికీ కౌన్సిలింగ్ ఇచ్చి అధికారులు ఇంటికి పంపించారు.
ఇక ఇప్పుడు సామ్ తన మొదటి భార్యతో ఫోన్లో మాట్లాడుతుడడంతో తట్టుకోలేని పూనమ్..అతనితో వాగ్వాదానికి దిగింది. దీంతో ఆగ్రహించిన సామ్..తనపై దాడి చేశారని పూనమ్ పోలీసులను ఆశ్రయించింది. చికిత్స నిమిత్తం ఆమె ఆసుపత్రిలో చేరినట్లు సమాచారం.