పొట్టి ఫార్మాట్ లో కెప్టెన్ గా కోహ్లి ప్రస్థానం..!

అంతర్జాతీయ టీ20ల్లో కోహ్లీ శకం ముగిసింది
సారథిగా టి 20 ప్రపంచ కప్ లో నమీబియా తో జరిగిన మ్యాచ్​ కోహ్లీకి చివరిది. కెప్టెన్ గా అతడి 50వ మ్యాచ్​ కావడం విశేషం. ఇండియా మోస్ట్ సక్సెస్ ఫుల్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ తర్వాత 2017లో.. కోహ్లి ఇంగ్లాండ్​పై తొలిసారి పొట్టి ఫార్మాట్​లో కెప్టెన్సీ బాధ్యతలను అందుకున్నాడు. అన్ని ఫార్మాట్లలో మేటి ఆటగాడిగా కొనసాగుతున్న కోహ్లి.. కెప్టెన్​గా పలు రికార్డులు కైవసం చేసుకున్నాడు.
అంతర్జాతీయ టీ20ల్లో ఇప్పటివరకు 49 మ్యాచ్లకు సారథ్యం వహించిన కోహ్లీ 29 విజయాలను అందించాడు. మహేంద్ర సింగ్​ ధోనీ తర్వాత తర్వాత అత్యధిక విజయాలు అతడివే.
కాగా టీ20ల్లో మొత్తం 94 మ్యాచ్​లు ఆడిన కోహ్లి.. 52.05 సగటుతో 3227 పరుగులు చేశాడు. ఈ ఫార్మాట్​లో మూడు వేల పరుగులు సాధించిన తొలి ప్లేయర్​గా విరాట్ నిలిచాడు.టీ20 ప్రపంచకప్​లలో రెండుసార్లు ‘ప్లేయర్​ ఆఫ్​ ది టోర్నీ’​గా నిలిచిన ఏకైక క్రికెటర్ కూడా అతడే.అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక(29) హాఫ్​ సెంచరీలు చేశాడు.
ఇక టీ20ల్లో పదివేలకుపైగా పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో భారత్ నుంచి కోహ్లీ మాత్రమే ఉండటం విశేష. ఈ జాబితాలో క్రిస్​గేల్​(14,276), కీరన్​ పొలార్డ్(11,236)​, షోయబ్​ మాలిక్ (11,033)​, కోహ్లీ(10,204), వార్నర్(10,019) ఉన్నారు.