టీ 20 వరల్డ్ కప్: నామ మాత్రపు మ్యాచ్లో నమీబియా పై భారత్ ఘన విజయం!

టి20 వరల్డ్ కప్ నుంచి అధికారికంగా నిష్క్రమించిన భారత జట్టు సోమవారం నమీబియా తో జరిగిన నామ మాత్రపు మ్యాచ్లో 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఓపెనర్లు రోహిత్ శర్మ(56), కేఎల్ రాహుల్(50) హాఫ్ సెంచరీలతో ఆకట్టుకున్నారు.
కాగా అంతకుముందు టాస్ఓడి తొలుత బ్యాటింగ్​కు దిగిన నమీబియా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 132 పరుగులు చేసింది. అజట్టులో డేవిడ్ వీస్ అత్యధికంగా 26 పరుగులు చేశాడు. మిగిలిన బ్యాటర్లలో బార్డ్ 21, వాన్ లింజన్ 14, ఫ్రై లింక్ 15 పరుగులు చేశారు. భారత బౌలర్లలో అశ్విన్, జడేజా తలో మూడు వికెట్లు.. బుమ్రా రెండు వికెట్లు తీశాడు.