రాముడి ఆగమనం.. ఆదిపురుష్ ట్రైలర్ మైండ్ బ్లోయింగ్..

Adipurushtrailer: రెబ‌ల్ స్టార్లు అభిమానులు ఎప్పుడెప్పుడాని ఎదురుచూస్తున్న పాన్ ఇండియా చిత్రం ఆదిపురుష్ ట్రైల‌ర్ ఎట్ట‌కేల‌కు విడుద‌లయ్యింది. పాన్ ఇండియాగా తెర‌కెక్కుతున్న ఈచిత్రం ట్రైల‌ర్.. తెలుగు ,త‌మిళం, క‌న్న‌డ‌, హిందీ, మ‌ళ‌యాళ భాష‌ల్లో విడుద‌ల అయ్యింది. అన్ని భాష‌ల్లోనూ ట్రైల‌ర్ కు సినీ ప్రేక్ష‌కుల నుంచి అపూర్వ స్పంద‌న ల‌భిస్తోంది. ముఖ్యంగా డార్లింగ్ ఫ్యాన్స్  సంబరాలు చేసుకుంటున్నారు. ఇక సోష‌ల్ మీడియా సంగంతి స‌రేస‌రి.. , రాముడిగా ప్ర‌భాస్ న‌ట‌న నెక్ట్స్ లెవ‌ల్‌, గ్రాఫిక్స్  అద్భుతం అంటూ నెటిజ‌న్స్ కామెంట్ల వ‌ర్షం కురిపిస్తున్నారు.

కాగా ట్రైల‌ర్ ప‌రిశీలించిన‌ట్ల‌యితే.. ఇదిరాముని క‌థ‌.. ఆయ‌న మ‌నిషిగా పుట్టి భ‌గ‌వంతుడయినా మ‌హానీయుడు..ఆయ‌న జీవితం ధ‌ర్మానికి స‌న్మార్గానికి నిద‌ర్శ‌నం..నా రాఘ‌వుడి క‌థే రామాయ‌ణం.. జ‌న్మ‌తో కాదు చేసే క‌ర్మ‌తో పెద్దా చిన్నాఅవుతామంటూ ప్ర‌భాస్ ప‌లికే సంభాష‌ణ‌లు ఆక‌ట్టుకున్నాయి. రాముడిగా ప్ర‌భాస్‌, సీత‌గా కృతిస‌న‌న్‌, రావ‌ణుడిగా సైఫ్‌, పాత్ర‌ల‌ను ప‌రిచ‌యం చేసి రామ – రావ‌ణ యుద్ధంతో ట్రైల‌ర్ ను ముగించిన తీరు అద్భుతంగా ఉంది.

ఇదిలా ఉంటే..గతంలో సినిమా టీజర్ విషయంలో డిసప్పాయింట్ గా ఉన్న ప్రభాస్ అభిమానులు, ట్రైలర్ అద్భుతంగా ఉండడంతో ఫుల్ జోష్లో కనిపిస్తున్నారు. మరోసారి ప్రభాస్ పాన్ ఇండియా రికార్డులు బద్ధల  కొట్టడం ఖాయమంటూ ధీమాగా చెబుతున్నారు.

Related Articles

Latest Articles

Optimized by Optimole