అత్యధిక పన్ను చెల్లింపుదారుడిగా అక్షయ్.. నెటిజన్స్ ప్రశంసల వర్షం!

బాలీవుడ్ టాప్ హీరోలలో ఒకరైనా  అక్షయ్ కుమార్ మరోసారి వార్తల్లో నిలిచాడు. దేశంలో అత్యధిక పన్ను చెల్లిస్తున్న చెల్లింపుదారుడిగా  అక్షయ్ నిలిచినట్లు ఆదాయపు పన్నుశాఖ వెల్లడించింది.ఇందుకు సంబంధించిన సర్టిఫికేట్ ఇంటర్నెట్‌లో హల్ చల్ చేస్తోంది.

ఇక బాలీవుడ్ కిలాడీ ఆదాయపు పన్ను సర్టిఫికేట్ పై నెటిజన్స్ భిన్నంగా స్పందిస్తున్నారు. “అక్షయ్ గ్లోబర్ స్టార్ కాదు అయితేనేం పరిశ్రమల కంటే అత్యధికంగా పన్ను చెల్లిస్తున్నాడు.. గత 5 సంవత్సరాలుగా నా సూపర్ స్టార్ అంటూ” ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. “ఆదాయపు పన్ను శాఖ సూపర్ స్టార్ అక్షయ్‌కుమార్‌ను సమ్మాన్ పాత్రతో సత్కరించింది. బాలీవుడ్ నుంచి అత్యధిక పన్ను చెల్లింపుదారునిగా పేర్కొంది. అతన్ని కెనడియన్ అని ద్వేషించేవారు ఈవిషయాన్ని గమనించాలని” మరో నెటిజన్ కామెంట్ జోడించాడు.

బాలీవుడ్ లో టాప్-పెయిడ్ స్టార్‌లలో షారూఖ్ , సల్మాన్, అక్షయ్ మొదటి మూడు స్థానాల్లో ఉంటారు. అయితే అక్షయ్ మాత్రమే ట్యాక్స్ పే విషయంలో వరుసగా రెండోసారి ఫస్ట్ ప్లేస్ లో నిలవడం గమన్హారం.

అక్షయ్ నటించిన తాజాచిత్రం ‘రక్షా బంధన్’ ఆగస్ట్ 11న విడుదల కాబోతుంది.అతనికి జోడిగా భూమి పెడ్నేకర్‌ నటించింది. ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వం వహించారు.హిమాన్షు శర్మ, కనికా ధిల్లాన్ కథ అందించగా.. కేప్ ఆఫ్ గుడ్ ఫిలిమ్స్ సహకారంతో కలర్ ఎల్లో ప్రొడక్షన్స్, జీ స్టూడియోస్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

ఇక తమిళ హీరో సూర్య నేషనల్ అవార్డు గెలుచుకున్న ‘సూరరై పొట్రు’ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేస్తున్నాడు అక్షయ్.  రాధిక మదన్, పరేష్ రావల్ మరోసారి  ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈచిత్రాన్ని హిందీలోనూ ..  సుధా కొంగర  తెరకెక్కిస్తున్నారు. మూవీ షూటింగ్‌ ఏప్రిల్ లో మొదలెట్టగా.. విడుదల తేదీని మాత్రం ప్రకటించలేదు.

Optimized by Optimole