నవ్వులు పూయిస్తున్న గజరాజు.. వీడియో వైరల్!

సోషల్ మీడియాలో జంతువుల విన్యాసాల వీడియోలనూ చాలానే చూశాం. అలాంటి వీడియో ఒకటి నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. ఈవీడియోలో చిన్నపిల్లాడి మాదిరి ఎనుగు పిల్ల చేసిన అల్లరి చూసి నెటిజన్స్ ఆసక్తికర కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈవీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది.
https://www.facebook.com/watch/?ref=search&v=1470551846662688&external_log_id=c6459900-1733-42da-827f-658749a8730d&q=Elephant%20Snatches%20Bananas%20From%20Man%E2%80%99s%20Hand

(credit:facebook)

ఇక వీడియో చూసినట్లయితే.. ఓ ఏనుగు పిల్ల దారిలో వెళ్తుండగా, ఇద్దరు వ్యక్తులు అరటి పండ్లు తింటుంటారు. అయితే అరటి పండ్లను చూసిన పిల్ల ఏనుగు నాకు ఇవ్వకుండా తింటారా మాదిరి మొదటి వ్యక్తి వద్ద అరటి పండు లాక్కోని తిన్నది. మరొక వ్యక్తి అరటి పండు నోట్లో పెట్టుకోగా దాన్ని సైతం లాక్కొని తింటుంది గజరాజు. ప్రస్తుతం ఈ వీడియో ట్విట్టర్లో వైరల్ అవుతోంది.

ఈ వీడియోపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ఏనుగు పిల్ల చాలా ముద్దస్తొందని నెటిజన్ కామెంట్ చేయగా.. గజరాజు తెలివైందని మరో నెటిజన్ కామెంట్ జోడించాడు. అయితే వీడియో ఎవరూ తీశారన్నది దానిపై మాత్రం క్లారీటీ లేదు.ఇప్పటీవరకు ఈవీడియోకు 1,937 రీట్వీట్లు రాగా.. 17.1K లైక్ లు వచ్చాయి.